11-04-2025 07:47:17 PM
టేకులపల్లి (విజయక్రాంతి): బడుగు బలహీన వర్గాల ఆశాజ్యోతి మహాత్మ జ్యోతిబాపూలే జయంతి వేడుకలు మండలంలో శుక్రవారం ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా పలువురు మాట్లాడారు. బడుగు బలహీన వర్గాల కోసం త్యాగం చేసిన గొప్ప స్ఫూర్తిదాత అని అన్నారు. బహుజనుల కోసం స్వయంగా పాఠశాల స్థాపించి తమ అర్థాంగితో విద్యను అందించిన గొప్ప మేథావి అన్నారు. పూలే ఆశయ సాధన కోసం అందరం కృషి చేయాలన్నారు. కార్యక్రమంలో ఏ ఏపీ ఎంకే రాష్ట్ర అధ్యక్షులు ఎం. ప్రభాకర్, నాయకులు బి.రమేష్ బాబు, కళాకారుల జిల్లా నాయకులు బి.జగన్, గిఫ్టు జిల్లా నాయకులు రవి, బి.సహస్ర, జి.సుష్మ, ఎం. రజిని తదితరులు పాల్గొన్నారు.