calender_icon.png 3 April, 2025 | 1:33 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

లక్ష్యాన్ని సాధించిన జెవిఆర్ఓసి ఐఎన్టీయూసీ వైస్ ప్రెసిడెంట్ రజాక్

27-03-2025 11:21:29 PM

కొత్తగూడెం (విజయక్రాంతి): సింగరేణి కొత్తగూడెం ఏరియాలోని జే.వి.ఆర్ ఓసి లో 2024-2025 ఆర్థిక సంవత్సరంలో, యాజమాన్యం నిర్దేశించిన బొగ్గు ఉత్పత్తి 112 లక్షల టన్నులను సాధించిన సందర్భంగా జే.వి.ఆర్ ఓసి లో విధులు నిర్వహిస్తున్న సూపర్వైజర్స్, పర్మినెంట్ ఉద్యోగులకు, కాంట్రాక్ట్ ఉద్యోగులకు సింగరేణి కోల్ మైన్స్ లేబర్ యూనియన్ (ఐ.ఎన్.టి.యు.సి) కొత్తగూడెం ఏరియా వైస్ ప్రెసిడెంట్ రజాక్, ఐఎన్టియుసి బృందం అభినందించారు. ఈ సందర్భంగా వైస్ ప్రెసిడెంట్ రజాక్ మాట్లాడుతూ... సింగరేణి 11 ఏరియాలలో ఎక్కడా లేని విధంగా సత్తుపల్లి నుండి అత్యధిక ఉత్పత్తి సాధించి చరిత్ర సృష్టించిన జే.వి.ఆర్ ఓసి ఉద్యోగులకు ప్రత్యేక ప్రోత్సాహక బహుమతులు ఇవ్వాలని యాజమాన్యాన్ని కోరారు.

సింగరేణి సంస్థ ఉత్పత్తి లక్ష్యాలను సాధించుటకు ఐఎన్టీయూసీ యూనియన్ ఎల్లప్పుడూ పూర్తి సహాయ సహకారాలు అందిస్తామని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో బ్రాంచ్ సెక్రటరీ తీగల క్రాంతి కుమార్, జాయింట్ సెక్రెటరీ నాగ ప్రకాష్, ఆర్గనైజింగ్ సెక్రటరీ కాసర్ల సమ్మయ్య, సెంట్రల్ కమిటీ నాయకులు సకినాల సమ్మయ్య, రామారావు (ఫిట్ సెక్రెటరీ, జె.వి.ఆర్ ఓసి), బాలాజీ (ఫిట్ సెక్రటరీ, కిష్టారం ఓసి), నాగేశ్వరరావు (ఫిట్ సెక్రటరీ, జె.వి.ఆర్ సి.హెచ్.పి), జే.వి.ఆర్ ఓసి అసిస్టెంట్ ఫిట్ సెక్రటరీలు కోటి, సురేష్, ఐవి రెడ్డి, రామచందర్, దావూద్, నరేందర్, ఖాజా మొయినుద్దీన్, రత్నాకర్, కలవల శ్రీనివాస్, పొట్టి కిరణ్, మురళి, వెంకటస్వామి, జనగామ శ్రీనివాస్, షట్రక్ బాబు ఇతర ముఖ్య నాయకులు పాల్గొన్నారు.