వెల్లడించిన ట్రస్టు చైర్మన్... మాజీ మంత్రి జలగం ప్రసాద్
భద్రాచలం (విజయక్రాంతి): భద్రాది కొత్తగూడెం జిల్లా భద్రాచలం నియోజకవర్గం, చర్ల మండలం, రాళ్లపురం గ్రామస్తులు త్రాగునీటికి ఎన్నో ఏళ్ల నుంచి ఇబ్బంది పడుతున్నారు. ఈ సందర్భంగా మాజీ ముఖ్యమంత్రి జలగం వెంగళరావు చారిటబుల్ ట్రస్ట్ వారు చేస్తున్న అనేక సహాయ సహకారాలను గ్రామస్తులు తెలుసుకున్నారు. దీంతో ఆ ట్రస్ట్ నిర్వహకులు మాజీ మంత్రివర్యులు జలగం ప్రసాదరావుని రాళ్లపురం గ్రామస్తులు 65 కుటుంబాలు సంప్రదించడం జరిగింది. వాళ్ల యొక్క సమస్యని తెలుసుకొన్న నిర్వాహకులు జేవియర్ ట్రస్ట్ ద్వారా త్రాగునీరుకి కావాల్సిన అన్ని సదుపాయాలని సమకూర్చడం జరిగింది. దీంతో ఎన్నో సంవత్సరాలుగా ఇబ్బంది పడుతున్న రాళ్లపురం గ్రామస్తుల సమస్య పరిష్కారం అవడంతో జేవిఆర్ ట్రస్ట్ చైర్మన్ మాజీ మంత్రి జలగం ప్రసాద్ రావుకి కృతజ్ఞతలు తెలిపారు. సమస్య చెప్పిన వెంటనే పరిష్కరించిన జలగం ప్రసాద్ బాబు సహాయం ఎప్పుడూ మరవలేనిదని కొనియాడారు.