03-04-2025 12:08:19 AM
డిప్యూటీ చీఫ్ లీగల్ ఎయిడ్ డిఫెన్స్ కౌన్సిల్ శ్రీరామ్ ఆర్య,
నాగర్‌కర్నూల్, ఏప్రిల్ 2 (విజయక్రాంతి) 18 ఏళ్ల లోపు బాల బాలికల రక్షణ కోసమే జువైనల్ కోర్టు అందుబాటులోకి వ చ్చిందని డిప్యూటీ చీఫ్ లీగల్ ఎయిడ్ డిఫె న్స్ కౌన్సిల్ శ్రీరామ్ ఆర్య అన్నారు. బుధవారం జిల్లా న్యాయ సేవ అధికార సంస్థ చైర్మన్,సెక్రటరీ ఆదేశాల మేరకు తాడూరు మండలం ఇంద్రకల్ ప్రభుత్వ ఉన్నత పాఠశాల నందు పాఠశాల ప్రధానోపాధ్యాయు లు శ్రీనివాస్ రెడ్డి అధ్యక్షతన జువైనల్ జస్టిస్ బోర్డ్ ఆధ్వర్యంలో నిర్వహించిన నాల్సా చైల్ ఫ్రెండ్లీ లీగల్ సర్వీసెస్ ఫర్ చిల్డ్రన్ స్కీం కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా హాజరయ్యారు.
జువైనల్ జస్టిస్ యాక్ట్ ఆధారంగా జువైనల్ బోర్డు ఏర్పాటైందని 18 ఏళ్ల లోపు నేరం చేసిన బాల బాలికలందరినీ సాధారణ నేరస్తుల లాగా కాకుండా అబ్జర్వేషన్ హోమ్ లో ఉంచి వారికి కౌన్సిలింగ్ ఇస్తూ నైపుణ్యాన్ని బట్టి వివిధ వృత్తుల్లో శిక్షణ ఇవ్వనున్నట్లు తెలిపారు. 6 నుంచి 14 సంవత్సరాల వయస్సు గల బాల బాలికలందరు పనిలో కాకుండా బడిలో చదువుకోవాలి అని విద్యాహక్కు చట్టం చెబుతుందన్నార. వారితోపా టు పారలీగల్ వాలంటీర్ గుండూర్ శ్యాం, బొడ్డుపల్లి మల్లేష్, బాలస్వామి, బాల బాలికలు పాల్గొన్నారు.