calender_icon.png 2 April, 2025 | 6:15 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

జస్టిస్ యశ్వంత్ వర్మ అలహాబాద్‌కే

25-03-2025 12:00:00 AM

  1. సుప్రీం కొలీజియం కీలక నిర్ణయం
  2. ప్రభుత్వ ఆమోదం తర్వాత బదిలీ
  3. విధులు కేటాయించని ఢిల్లీ కోర్టు
  4. నాపై కుట్ర జరిగింది: జడ్జి యశ్వంత్ వర్మ
  5. అభిశంసనే సరి: అలహాబాద్ హైకోర్టు బార్ అసోసియేషన్

న్యూఢిల్లీ, మార్చి 24: ఢిల్లీ హైకోర్టు జడ్జి జస్టిస్ యశ్వంత్ వర్మ ఇంట్లో కరెన్సీ కొట్టలు దొరికాయన్న వార్తలు హల్‌చల్ చేస్తున్నా  తాను నిర్దోషినని.. తన పేరు, ప్రఖ్యాతులను దెబ్బతీసేందుకు కుట్ర జరిగిందని జస్టి  వర్మ చెప్తున్నా కానీ పెద్దగా ఎవరూ పట్టించుకోవడం లేదు.

సోమవారం ఢిల్లీ హైకోర్టు రిజిస్ట్రీ జస్టిస్ వర్మకు ఎటువంటి విధులు అ  తాజాగా సుప్రీం కొలీజియం వర్మను అలహాబాద్ హైకోర్టుకు బదిలీ చేయాలని కీలకనిర్ణయం తీసుకుంది. హోలీ పండుగ రోజు వర్మ ఇంట్లో లేని సమయంలో అగ్నిప్రమాదం జరగ్గా.. మంటలు ఆర్పేందుకు వెళ్లిన సిబ్బందికి పెద్ద ఎత్తున నోట్ల కట్టలు దొరికినట్టు వార్తలు వచ్చాయి.

అగ్నిప్రమాదం తర్వాత తీసిన వీడియోల్లో కూడా కాలిన నోట్ల కట్టలు స్పష్టంగా కనిపించినట్లు ఢిల్లీ పోలీస్ కమిషనర్ ఢిల్లీ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తికి సమర్పించిన వీడియోలో ఉంది. ఆ నివేదికను ఢిల్లీ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి సుప్రీం కోర్టు ప్రధాన న్యాయమూర్తికి సమర్పించారు.   

కొలీజియం కీలక నిర్ణయం

జస్టిస్ యశ్వంత్ వర్మను అలహాబాద్ హైకోర్టుకు బదిలీ చేయాలని కొలీజియం సిఫారసు చేసింది. అయితే ఈ బదిలీకి కేంద్రం  తెలపాల్సి ఉంది. జస్టిస్ వర్మ 2021 నుంచి ఢిల్లీ హైకోర్టులో విధులు నిర్వర్తిస్తున్నారు. ‘నేను కానీ నా కుటుంబం కానీ ఎప్పుడూ సామగ్రి భద్రపరిచే గదిలో డబ్బులు పెట్టం. అసలు మా ఇంట్లో ఎటువంటి నగదు లభించలేదు. మేము అన్ని లావాదేవీలు బ్యాంకుల ద్వారానే జరుపుతాం’ అని వర్మ తెలిపారు. 

వర్మ తీర్పులపై సమీక్షించండి

వర్మపై అలహాబాద్ హైకోర్టు బార్ అసో సియేషన్ గుర్రుగా ఉంది. జడ్జిగా ఇచ్చిన అన్ని తీర్పులపై మరోసారి సమీక్ష జరపాలని బార్ అసోసియేషన్ డిమాండ్ చేసింది. ఆ యన్ను న్యాయవాద వృత్తి నుంచి వెంటనే తొలగించేలా ‘అభిశంసన’ ప్రవేశపెట్టాలని పేర్కొన్నది. బార్ అసోసియేషన్ అ ధ్యక్షుడు అనిల్ తివారీ మాట్లాడుతూ.. ‘వర్మ తీరు ప్రజాస్వామ్యానికి చాలా ప్రమాదకరం. ఇది న్యాయవ్యవస్థపై ఉన్న న మ్మకాన్ని కోల్పోయేలా చేస్తుంది. నమ్మకం కోల్పోతే దేశమే కూలిపోతుంది.’ అని అన్నారు.