calender_icon.png 16 January, 2025 | 1:30 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

న్యాయమే గెలిచింది

25-08-2024 02:05:09 AM

జనం కోసం సంస్థ అధ్యక్షుడు కసిరెడ్డి భాస్కర్‌రెడ్డి 

ఎన్ కన్వెన్షన్ కూల్చివేతపై హర్షం

హైదరాబాద్ సిటీబ్యూరో, ఆగస్టు 24 (విజయక్రాంతి): మాదాపూర్‌లోని ఎన్ కన్వె న్షన్ అక్రమ నిర్మణాన్ని హైడ్రా అధికారులు కూల్చివేయడం పట్ల జనం కోసం సంస్థ అధ్యక్షుడు కసిరెడ్డి భాస్కర్‌రెడ్డి హర్షం వ్యక్తం చేశారు. తుమ్మిడికుంట చెరువు ఆక్రమించి నిర్మాణం చేపట్టిన ఎన్ కన్వెన్షన్‌ను కూల్చివేయాలని భాస్కర్ రెడ్డి ఈ నెల 20న హైడ్రా కమిషనర్ ఏవీ రంగనాథ్‌కు ఫిర్యాదు చేశా రు. శనివారం కూల్చివేతలు చేపట్టిన సందర్భంగా భాస్కర్‌రెడ్డి స్పందిస్తూ.. ఫిర్యాదు చేసిన వెంటనే స్పందించిన హైడ్రా అధికారులకు, సీఎం రేవంత్‌రెడ్డికి కృతజ్ఞతలు తెలి పారు.

ఈ సందర్భంగా ఆయన మాట్లాడు తూ.. తుమ్మిడి చెరువులో సర్వే నంబరు 36, 37, 38/పి, 11/2, 11/36, 68/పి, 41/పికి చెందిన 29 ఎకరాల 24 గుంటల చెరువు, ప్రభుత్వ భూమి ఎఫ్‌టీఎల్, బఫర్ జోన్‌లపై ఉన్న కబ్జాలను తొలగించి చెరువును పునరుద్ధరించాలని ఈ నెల 20న హైడ్రాకు ఫిర్యా దు చేశానని తెలిపారు. ఎన్ కన్వెన్షన్ అక్రమ నిర్మాణంపై 15 ఏళ్లుగా చేస్తున్న పోరాట ఫలితంగా శనివారం హైడ్రా రూపంలో న్యా యం జరిగిందని ఆనందం వ్యక్తంచేశారు.

హైటెక్ సిటీ ప్రాంతంలోని ఖానామెట్ రెవె న్యూ గ్రామం పరిధిలో 29 ఎకరాల 24 గుంటలకుపైగా విస్తరించిన  తుమ్మిడికుంట చెరువు ఆక్రమణలపై 2012లోనే లోకాయుక్తాలో జనం కోసం సంస్థ తరుపున ఫిర్యాదు చేసినట్టు గుర్తుచేశారు. లోకాయుక్త (2815/ 2012/బి1) ప్రభుత్వానికి, అధికారులకు అనేకమార్లు హెచ్చరికలు జారీచేయగా, 2౦14 లో చర్యలు చేపడుతున్నట్టు ప్రభుత్వం ప్రకటనలు చేసింది. ఆ తర్వాత వెనక్కి తగ్గిందని విమర్శించారు.