నిర్మల్ (విజయక్రాంతి): ప్రజా పాలన ప్రభుత్వంలో ప్రజలకు తప్పకుండా ఇచ్చిన హామీలను నెరవేర్చేందుకు తమ ప్రభుత్వం సిద్ధంగా ఉందని డిసిసి అధ్యక్షులు శ్రీ ఆర్ రావు అన్నారు. శనివారం నిర్మల్ జిల్లాలో తమ డిమాండ్ల సాధన కోసం ఆందోళన చేస్తున్న సర్వ శిక్ష అభియాన్ ఉద్యోగులు రెండవ ఆరోగ్య కార్యకర్తలు దివ్యాంగుల సంఘం నాయకులు వేరువేరుగా ఆయన కలిసి తమ సమస్యలను ముఖ్యమంత్రి దృష్టికి ఇన్చార్జి మంత్రి సీతక్క దృష్టికి తీసుకువచ్చి న్యాయం జరిగేలా చూడాలని విన్నవించారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఉద్యోగులకు ఇచ్చిన ఆమె మేరకు తప్పకుండా న్యాయం జరిపిస్తామని వారు వారికి భరోసా ఇచ్చారు. ఈ కార్యక్రమంలో ఆయా సంఘాల ప్రతినిధులు పాల్గొన్నారు.