హైదరాబాద్: తెలంగాణ హైకోర్టు తాత్కాలిక ప్రధాన న్యాయమూర్తిగా జస్టిస్ సుజయ్‌పాల్(Justice Sujay Pal)ను నియమిస్తూ రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఉత్తర్వులు జారీ చేశారు. హైకోర్టు సీనియర్ న్యాయమూర్తి జస్టిస్ సుజయ్ పాల్‌కు ప్రధాన న్యాయమూర్తి బాధ్యతలను అప్పగిస్తూ ఈ మేరకు ఉత్తర్వులు జారీ చేసింది. ప్రస్తుత ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ అలోక్ ఆరాధే(Justice Alok Aradhe) బాంబే హైకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా బదిలీ అయ్యారు. జస్టిస్ ఆరాధే బదిలీతో తెలంగాణ హైకోర్టులో ఖాళీ ఏర్పడింది. ఇప్పుడు దానిని జస్టిస్ సుజయ్‌పాల్ భర్తీ చేశారు.
జూన్ 21, 1964న జన్మించిన జస్టిస్ సుజయ్ పాల్ తన B.Com, M.A., LL.B పూర్తి చేశారు. 1990లో మధ్యప్రదేశ్ బార్ కౌన్సిల్‌లో(Madhya Pradesh Bar Council) నమోదు చేసుకున్నారు. అతను బ్యాంకులు, మానవ హక్కుల కమిషన్‌లు, బోర్డులతో సహా వివిధ సంస్థలకు సేవలందించారు. జస్టిస్ పాల్ మే 27, 2011న మధ్యప్రదేశ్ హైకోర్టుకు అదనపు న్యాయమూర్తిగా నియమితులయ్యారు. ఏప్రిల్ 14, 2014న శాశ్వత న్యాయమూర్తి అయ్యారు. సుప్రీంకోర్టు కొలీజియం సిఫార్సు(Supreme Court Collegium recommendation) మేరకు మార్చి 21, 2024న తెలంగాణ హైకోర్టు(Telangana High Court)కు న్యాయమూర్తిగా బదిలీ అయ్యారు. ప్రస్తుతం ఆయన హైకోర్టు తాత్కాలిక ప్రధాన న్యాయమూర్తిగా నియమితులయ్యారు.