calender_icon.png 16 January, 2025 | 5:43 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

హైకోర్టు తాత్కాలిక సీజేగా జస్టిస్ సుజయ్‌పాల్

16-01-2025 03:05:07 AM

హైదరాబాద్, జనవరి 15 (విజయ క్రాంతి): హైకోర్టు సీజే జస్టిస్ ఆలోక్ అరాధేను బాంబే హైకోర్టు సీజేగా బది లీ చేస్తూ రాష్ట్రపతి ద్రౌపది ముర్ము మంగళవారం ఉత్త ర్వులు జారీ చేశా రు. ఈ నేపథ్యంలో రాష్ట్ర హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి బాధ్యతలను జస్టిస్ సుజయ్‌పాల్‌కు అప్పగించారు. జస్టిస్ సుజయ్‌పాల్ 1964 జూన్ 21న జన్మించారు. మధ్య ప్రదేశ్ జబల్‌పూర్ లోని రాణిదుర్గావతి యూనివర్సిటీలో ఎల్‌ఎల్బీ, పీజీ పూర్తి చేశారు.

1990లో మధ్యప్రదేశ్ బార్ కౌన్సిల్లో ఎన్‌రోల్ అయ్యారు. సివిల్, రాజ్యాంగ, పారిశ్రామిక వివాదాలు, సర్వీసు కేసుల్లో ప్రావీణ్యం ఉంది. 2011లో మధ్యప్రదేశ్ హైకోర్టు న్యాయమూర్తిగా నియమితులయ్యారు. గత ఏడాది మార్చి 26న తెలంగాణ హైకోర్టుకు బదిలీపై వచ్చారు. ప్రస్తుతం సీనియర్ న్యాయమూర్తి అయిన జస్టిస్ సుజయ్‌పాల్‌కు ప్రధాన న్యాయమూర్తి బాధ్యతలు అప్పగిస్తూ రాష్ట్రపతి ఉత్తర్వులు జారీ అయ్యాయి.