హైదరాబాద్, ఆగస్టు 27 (విజయక్రాంతి): ఎమ్మెల్సీ కవితకు బెయిల్ ఇచ్చి సుప్రీం కోర్టు న్యాయం పక్షాన నిలిచిందని ఎమ్మెల్సీ మధుసూదనాచారి పేర్కొన్నారు. మంగళవారం తెలంగాణ భవన్‌లో దేవీప్రసాద్, పల్లె రవికుమార్‌తో కలిసి మాట్లాడారు. కేసు నుంచి కడిగిన ముత్యంలా కవిత బయట పడుతుందన్నారు. కవిత బెయిల్ పిటిషన్ సందర్భంగా చేసిన సుప్రీం వ్యాఖ్యలు ఈడీ ,సీఈఐ లకు చెంప పెట్టు లాంటివన్నారు.
బెయిల్ ఇవ్వడం సంతోషం: వినోద్
కవితకు సుప్రీంకోర్టు బెయిల్ ఇవ్వడం సం తోషంగా ఉందని మాజీ ఎంపీ వినోద్‌కుమార్ అన్నారు. తెలంగాణ భవన్‌లో సోమాభరత్‌కుమార్‌తో కలిసి మాట్లాడుతూ మహిళలకు బెయి ల్ విషయంలో కొన్ని చట్టబద్ధమైన హక్కులుఉంటాయని, ఢిల్లీ హైకోర్టు ఇచ్చిన తీర్పును సుప్రీం కోర్టు తీవ్రంగా తప్పుపట్టిందన్నారు.
న్యాయం గెలిచింది: దాసోజు శ్రవణ్
కవితకు బెయిల్‌తో సత్యం, న్యాయం గెలిచినట్లు ఉందని బీఆర్‌ఎస్ సీనియర్ నాయకుడు డాక్టర్ శ్రవణ్ దాసోజు అభివర్ణించారు. కవితకు అన్యాయం జరిగిందని కోర్టు వ్యాఖ్యలు స్పష్టం చేశాయని ఓ ప్రకటనలో పేర్కొన్నారు.