జిల్లా కేంద్రమైన జగిత్యాలలో రోడ్డెక్కిన ఏబీవీపీ ధర్నా, రాస్తారోకో
జగిత్యాల, (విజయక్రాంతి): జగిత్యాల జిల్లా మెట్ పల్లి మండలం పెద్దాపూర్ గురుకుల పాఠశాలలో పాము కాటుతో మృతి చెందిన అనిరుద్, గత వారం రోజుల క్రితం మరణించిన గుణఆదిత్య కుటుంబాల ఆదుకొని రూ. 50 లక్షల ఎక్స్ గ్రేషియా, వారి కుటుంబాలలో ఒకరికి ప్రభుత్వ ఉద్యోగం ఇవ్వాలని డిమాండ్ చేస్తూ ఈ ఏబీవీపీ ఆధ్వర్యంలో జిల్లా కేంద్రమైన జగిత్యాల ప్రధాన రహదారిపై బైఠాయించి ధర్నా, రాస్తారోకో చేశారు. ఈ సందర్భంగా రాష్ట్ర హాస్టల్స్ కన్వీనర్ మారవేణి రంజిత్ కుమార్, కార్యదర్శి మల్యాల రాకేష్ మాట్లాడుతూ.. పెద్దాపూర్ గురుకుల క్యాంప్ లో అనురుద్ అనే విద్యార్థి పాముకాటుతో మరణించిన ఇప్పటివరకు రాష్ట్ర ప్రభుత్వం స్పందించ పాము కాటును కప్పిపుచ్చేలా ప్రయత్నం చేయడం సిగ్గుచేటని ఆగ్రహం వ్యక్తం చేశారు.
ఇదే పాఠశాలలో గుణ ఆదిత్య అనే విద్యార్థి చనిపోయి పది రోజులు గడవకముందే మరొక విద్యార్థి అనిరుద్ చనిపోవడం బాధాకరం అన్నారు. అయినప్పటికీ ఈ ఘటనలపై రాష్ట్ర ప్రభుత్వం, అధికారులు స్పందించకపోవడం సిగ్గుచేటు అన్నారు. విద్యార్థులు చనిపోయిన తరువాత చెట్ల పొదలను చెత్త, చెదారం తొలగించడం ప్రభుత్వ అధికారుల నిర్లక్ష్యం స్పష్టంగా కనిపిస్తుందని ద్వజమెత్తారు. చనిపోయిన తరువాత రావడం సమస్యల గాలికి వదిలేయ డమే దీనికి ముఖ్య కారణమని పేర్కొన్నారు. అలాగే తరగతి గదిలోనే దేశ భవిష్యతు రూపు దిద్దుకుంటుందని చెప్పుకునే రోజు నుండి తరగతి గదిలోనే విద్యార్థులు చనిపోయే పరిస్థితి వరకు వచ్చిందని అన్నారు.
కాంగ్రెస్ ప్రభుత్వం అధికారానికి వచ్చిన 9 నెలల్లో 36 మంది విద్యార్థులు మరణించడానికి రాష్ట్ర ప్రభుత్వమేనని కారణమని ఆరోపించారు. గురుకుల విద్యాలయాల్లో విద్యార్థుల మరణాలపై హైకోర్టు సిట్టింగ్ జడ్జితో విచారణ చేయాలని డిమాండ్ చేశారు. ఇకనైనా అధికారులు మొద్దు నిద్ర వీడి గురుకులాల పరిస్థితి, మౌలిక వసతుల మెరుగుపరిచేందుకు చర్యలు తీసుకునేలా రాష్ట్ర ప్రభుత్వం చొరవ చూపాలని లేకపోతే తెలంగాణ రాష్ట్రంలో మంత్రులను, ముఖ్యమంత్రిని తిరగనివ్వమని, ప్రభుత్వాన్ని గద్దె దింపడానికైనా వెనకడుగు వేయమని హెచ్చరించారు. జగిత్యాల జిల్లా కలెక్టరేట్ ఆఫీస్ కి పక్కన ఉన్న గురుకులంలో కనీస మౌలిక వసతి లేక చెత్తాచెదారంతో టాయిలెట్ సరిపోక పిల్లలు బయటనే స్థానం చేస్తే కలెక్టర్ స్పందించకపోవడం బాధాకరం అన్నారు. ప్రభుత్వం స్పందించి సమస్యలు పరిష్కరించాలని ఏబీవీపీ డిమాండ్ చేశారు.