calender_icon.png 5 February, 2025 | 10:39 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ఎస్సీ వర్గీకరణలో మాలలకు న్యాయం చేయాలి

05-02-2025 06:34:41 PM

వాంకిడి (విజయక్రాంతి): ఎస్సీ వర్గీకరణలో మాలలకు ప్రభుత్వం అన్యాయం చేసిందని సమన్యాయం చేయాలని డిమాండ్ చేస్తూ బుధవారం వాంకిడి మండల కేంద్రంలో భారతీయ బౌద్ధ మహాసభ, అంబేద్కర్ సంఘం, సిద్ధార్థ యువజన సంఘాల ఆధ్వర్యంలో బైక్ ర్యాలీ నిర్వహించి జాతీయ రహదారిపై బైఠాయించి నిరసన తెలిపారు. ఈ సందర్భంగా దళిత సంఘాల నాయకులు మాట్లాడుతూ... దేశంలో ఎక్కడ లేని విధంగా తెలంగాణ రాష్ట్ర సీఎం ఎస్సీ వర్గీకరణ నిర్వహించి మాలలకు తీరని అన్యాయం చేశారని మండిపడ్డారు. రానున్న స్థానిక సంస్థల ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి మాలల తడాఖా చూపించాలని పిలుపునిచ్చారు.

మాలలు ఐక్యంగా ఉండి కాంగ్రెస్ పార్టీకి గుణపాఠం చెప్పాల్సిన అవసరం ఉందన్నారు. రాజ్యాంగ బద్దంగా రిజర్వేషన్ల వర్గీకరణ నిర్వహిస్తే తమకు ఎలాంటి అభ్యంతరం లేదని, ఎస్సీ వర్గీకరణ కమిషన్ మాదిగల పక్షపాతంగా వ్యవహరించిందని విశ్వక్షపాతంగా విచారణ జరపలేదని ఆరోపించారు. ఈ కార్యక్రమంలో భారతీయ బౌద్ధ మహాసభ జిల్లా అధ్యక్షుడు అశోక్ మహల్కర్, అంబేద్కర్ సంఘం మండల ప్రధాన కార్యదర్శి దుర్గం సునీల్, ఉపాధ్యక్షుడు హంసరాజ్ సమాజా అధ్యక్షుడు రాజేంద్రప్రసాద్, బౌద్ధ పాసక్ పాండుజి నాయకులు రోషన్, ప్రతాప్, అరుణ్, రమేష్, మనోజ్, కార్తీక్, దీపక్, జైపాల్, రాజేశ్వర్, రాకేష్ తదితరులు పాల్గొన్నారు.