calender_icon.png 24 November, 2024 | 8:45 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

న్యాయం ప్రతి పేదవారికి అందాలి

24-11-2024 07:05:40 PM

సెక్రటరీ ఆఫ్ డిస్ట్రిక్ట్స్ లీగల్ సర్వీసెస్ అథారిటీ, సీనియర్ సివిల్ జడ్జి కే.యువరాజ్

ఘనంగా రాజ్యాంగ దినోత్సవం 

కుమ్రం భీం ఆసిఫాబాద్ (విజయక్రాంతి): ప్రతి పేదవారికి రాజ్యాంగ పరమైన హక్కులతో పాటు న్యాయం అందాల్సిన అవసరం ఉందని సెక్రటరీ ఆఫ్ డిస్ట్రిక్ట్స్ లీగల్ సర్వీసెస్ అథారిటీ, సీనియర్ సివిల్ జడ్జి కే.యువరాజ్ పేర్కొన్నారు. ఆసిఫాబాద్ లుంబిని బౌద్ధ విహార్ ప్రాంగణంలో ఆదివారం రాజ్యంగ దినోత్సవం, మహోన్నత రాజ్యాంగంపై చర్చ కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన సీనియర్ సివిల్ జడ్జి కే.యువరాజ్ మాట్లాడారు. ఈ సందర్భంగా సమతా భారత్ ఐక్య వేదిక పోస్టర్ ను ఆవిష్కరించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. ప్రపంచంలోనే భారత రాజ్యాంగం ఎంతో మహోన్నతమైనదని అన్నారు.

మారుతున్న పరిస్థితులకు అనుగుణంగా రాజ్యంగంలో సవరణలు జరుగుతాయి తప్ప రాజ్యాంగ ప్రియాంబుల్ ను ఎవరూ మార్చలేరని తెలిపారు. న్యాయ వ్యవస్థపై ప్రజల్లో అపారమైన నమ్మకం ఉందని అన్నారు. న్యాయ వ్యవస్థలో కూడా మారుతున్న సాంకేతిక పరిజ్ఞానం ఉపయోగించుకుని కోర్టులో జరిగే ప్రక్రియను కూడా లైవ్ లో తిలకించే అవకాశం వచ్చిందని చెప్పారు. ఆసిఫాబాద్ ప్రాంతంలో గంజాయి, పోక్సో కేసులు నమోదవుతున్నాయని, ఇది దురద్రుష్టకరం అని ఆయన విచారం వ్యక్తం చేశారు. యువత పెడదారి పట్టకుండా తల్లిదండ్రులు జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. సెంట్రల్ యూనివర్సిటీ ప్రొఫెసర్ కే. లక్ష్మి నారాయణ మాట్లాడుతూ.. రాజ్యాంగంలో బాబాసాహెబ్ అంబేద్కర్ విద్యకు ఎంతో ప్రాధాన్యత ఇచ్చారని అన్నారు.

రాజ్యాంగం ప్రమాదంలో ఉందని, రాజ్యాంగాన్ని కాపాడుకోవలసిన అవసరం ఉందని చెప్పారు. డాక్టర్ గోపినాథ్ మాట్లాడుతూ.. రాజ్యాంగాన్ని భవిష్యత్తు తరాలకు అందించేలా చర్యలు తీసుకోవాలని అన్నారు. రాజ్యంగం అమలులో పాలకులు విఫలం అవుతున్నాయని అన్నారు. పాలకులను ప్రశ్నించాల్సిన అవసరం ఉందని అన్నారు. సోషల్ యాక్టివిస్ట్ నిర్మల మాట్లాడుతూ.. బోధించు సమీకరించు పోరాడు అనే బాబాసాహెబ్ అంబేద్కర్ సిద్దాంతాన్ని అవలంబించాలని అన్నారు. ఈ కార్యక్రమంలో సీనీయర్ జర్నలిస్టు మసాదె లక్ష్మి నారాయణ, సెంట్రల్ కమిటీ అధ్యక్షుడు దుర్గం హొక్టు, నిర్వాహకులు అప్పారావు జాడే, ఆనంద్ జాడె, డాక్టర్ టేమాజీ, ఆసిఫాబాద్ డిపో మేనేజర్ విశ్వనాథ్, మున్సిపల్ కమిషనర్ భుజంగరావు తదితరులు పాల్గొన్నారు.