calender_icon.png 27 December, 2024 | 4:57 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ఆశ వర్కర్లకు న్యాయం చేయాలి

27-12-2024 02:05:22 AM

* సీపీఐ రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని

ఖమ్మం, డిసెంబర్ 26 (విజయక్రాంతి): ప్రభుత్వం ఆశ వర్కర్లకు ఇచ్చిన హామీలను నెరవేర్చి న్యాయం చేయాలని సీపీఎం రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం డిమాండ్ చేశారు. ఆశ వర్కర్ల యూనియన్ (సీఐటీయూ) విభాగం చేపట్టిన బస్సు యాత్ర గురువారం ఖమ్మం నగరానికి చేరుకున్న సందర్భంగా ఆందోళనకారులకు ఆయన మద్దతు తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వం ఆశ వర్కర్ల  పట్ల నిర్లక్ష్యంగా వ్యవహరిస్తుందన్నారు.

గత ప్రభుత్వం కంటే తమ ప్రభుత్వం ఆశ వర్కర్లకు మెరుగైన సౌకర్యాలు కల్పిస్తామని హామీ ఇచ్చిందన్నారు. కార్యక్రమంలో సీఐటీయూ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పాలడుగు భాస్కర్, ఆశ వర్కర్స్ యూనియన్ నాయకులు రమణ, కమల, రాణి, రాధ, విజయ పాల్గొన్నారు.