calender_icon.png 4 April, 2025 | 10:02 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

నిరుద్యోగ కళాకారులకు న్యాయం చేయాలి

03-04-2025 02:54:10 PM

కుమ్రం భీం ఆసిఫాబాద్,(విజయక్రాంతి): తెలంగాణ రాష్ట్ర ఉద్యమంలో పాల్గొన్న నిరుద్యోగ కళాకారులకు సాంస్కృతిక సారథి లో ఉద్యోగాలు కల్పించాలని  నిరుద్యోగ కళాకారులు  కోరారు . గురువారం జిల్లా కేంద్రంలోని కోట్నాక భీమ్ రావు చిల్డ్రన్ పార్క్ లోని తెలంగాణ అమర వీరుల స్తూపం వద్ద నివాళులర్పించి మాట్లాడారు. ఇటీవల సిర్పూర్ ఎమ్మెల్యే పాల్వాయి హరీష్ బాబు,మెదక్ ఎమ్మెల్సీ శేరి సుభాష్ రెడ్డి  నిరుద్యోగ కళాకారుల పక్షాన తమ గలాన్ని వినిపించినందుకు కృతజ్ఞతలు  తెలిపారు.  మేనిఫెస్టోలో ప్రకటించిన విధంగా కాంగ్రెస్ ప్రభుత్వం నిరుద్యోగ కళాకారులకు ఉద్యోగాలు కల్పించి ఆదుకోవాలని కోరారు. తెలంగాణ రాష్ట్రంలో కళాకారుల పాత్ర ఎనలేనిదన్నారు. సీఎం రేవంత్ రెడ్డి ఇప్పటికైన సాంస్కృతిక సారథిలో నిరుద్యోగ కళాకారులకు ఉద్యోగాలు కల్పించాలని డిమాండ్ చేశారు.ఈ కార్యక్రమంలో నిరుద్యోగ కళాకారుల సంఘం అధ్యక్షురాలు సంధ్య, డోంగ్రి సంతోష్, మేడి కార్తీక్, సమ్మక్క, రణధీర్ ఆర్యన్, రాథోడ్  ప్రశాంత్ తదితరులు పాల్గొన్నారు.