27-03-2025 12:00:00 AM
కలెక్టర్, ఎస్పీని కోరిన సీపీఎం నాయకులు
భద్రాచలం, మార్చి 26 (విజయ క్రాంతి): భద్రాచలం పట్టణం నందు గల సలీం టీ స్టాల్ ఎదురు రోడ్డు నందు నూతనంగా నిర్మిస్తున్న ఆరంతస్తుల భవనం కుప్పకూలి ఆరుగురు కార్మికులు భవన శిథిలాల కింద చిక్కుకున్న సంఘటన పై అధికారుల తీరును సిపిఎం నాయకులు తీవ్రంగా ఖండించారు.
ఈ సందర్భంగా భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కలెక్టర్ మరియు ఎస్పీ కూలిన భవనం దగ్గరకు వచ్చి పరిశీలించి న సందర్భంగా సిఐటియు జిల్లా ఉపాధ్యక్షులు యంబి నర్సారెడ్డి కలెక్టర్ గారితో మాట్లాడుతూ తక్షణమే మీరు భవన శిథిలాల కింద చిక్కుకున్న కార్మికులను రక్షించాలని వారిని వెంటనే తరలించి చికిత్స అందించాలని ఒకవేళ చనిపోతే ఆ కుటుంబా లకు తగిన న్యాయం చేయాలని ముందు వారిని బయటికి తీయటానికి సరైన ప్రికాషన్స్ చేపట్టాలని వారిని అడగటం జరిగినది.
ఇప్పటికైనా ఇటువంటి భవనాలు నిర్మించేటప్పుడు సంబంధించిన అధికారులు తగిన జాగ్రత్తలు తీసుకోవాలని వాటి పర్మిషన్లు సక్రమంగా ఉన్నాయా లేదా అని తెలుసుకొని అవి ఇంజనీరింగ్ ప్లా న్ ప్రకారం నిర్మితమవుతున్నాయా లేదా అని పరిశీలించి పరిమిషన్స్ ఇవ్వాలని డిమాండ్ చేసినారు.
పాత భవనం 9 అంగుళాల పిల్లర్లుతో ఉన్నటువంటి భవనం మీద ఎటువంటి పర్మిషన్లు తీసుకోకుండా ఆరంతస్తులు నిర్మించడం వలన ఈ రోజు ఇటువంటి అనర్ధాలు జరిగాయని దీనికి నైతికంగా ఎవరు బాధ్యత వహిస్తారు ఆ కుటుంబాలకు ఏమి న్యాయం చేస్తారని ఈ సందర్భంగా ప్రశ్నించారు భవిష్యత్తులో అయినా ఇటువంటి సంఘటనలు జరగకుండా ముందస్తు జాగ్రత్తలు తీసుకొని కార్మికుల ప్రాణాలు కాపాడాలని కోరినారు ఈ కార్యక్రమంలో సిఐటి నాయకులు గడ్డం స్వామి, బండారు శరత్ బాబు, సంతోష్ తదితరులు పాల్గొన్నారు.