25-03-2025 08:32:02 PM
ఎమ్మెల్సీ దండే విఠల్..
కుమ్రం భీం ఆసిఫాబాద్ (విజయక్రాంతి): ఎన్నో ఏండ్లుగా పోడు భూములలో సాగు చేసుకుంటున్నా రైతులను ఇబ్బందులకు గురిచేయొద్దని ఎమ్మెల్సీ దండే విఠల్ అన్నారు. మంగళవారం జిల్లా అటవీశాఖ అధికారి నీరజ్ కుమార్ కు రైతులతో కలిసి వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్సీ మాట్లాడుతూ... అటవీ ప్రాంతంలో నివసిస్తున్న ప్రజలు తాగునీటి కోసం బోర్లు వేసుకునే అవకాశం కల్పించాలని, తాతల కాలం నుండి సాగు చేస్తున్న పోడు భూముల్లో కందకాలు తవ్వకూడదన్నారు. రెవెన్యూ, ఫారెస్ట్ శాఖల మధ్య రైతులు నలిగిపోతున్నారని జాయింట్ సర్వే నిర్వహించి రైతులకు న్యాయం చేయాలని డీఎఫ్ఓ ను కోరారు. ఈ కార్యక్రమంలో జడ్పీ మాజీ చైర్మన్ గణపతి, నాయకులు నానయ్య, విశ్వేశ్వర్, ఉమా మహేష్, సురేష్, పోడు రైతులు పాల్గొన్నారు.