అమ్రాబాద్ అటవీ శాఖ ఆఫీస్ ఎదుట ధర్నా
నాగర్‌కర్నూల్, జనవరి 9 (విజయక్రాంతి): జంగల్ కటింగ్ కోసం దినసరి కూలీగా పనిచేసిన మహిళ అనుమానాస్పద స్థితిలో మృతి చెందడంతో ఆమె కుటుంబానికి న్యాయం చేయాలని డిమాం డ్ చేస్తూ గురువారం రాత్రి అమ్రాబాద్ మండలం అటవీశాఖ రేంజ్ ఆఫీసు ఎదుట బాధిత కుటుంబ సభ్యులు ధర్నాకు దిగారు.
దోమలపెంట నుంచి మన్ననూర్ గ్రామం వరకు రోడ్డుకు ఇరువైపులా జంగల్ కటింగ్ కోసం అటవీశాఖ అధికారులు దోమలపెంట ప్రాం తానికి చెందిన 10 మంది కూలీలను ఏర్పా టు చేశారు. రోజులాగే గురువారం దోమలపెంట ప్రాంతానికి చెందిన ఫాతిమా (40) తోటి కూలీలతో కలిసి జంగల్ కటింగ్ పని చేస్తుండగా అనుమానాస్పద స్థితిలో కుప్పకూలి మృతిచెం దింది.
ఆమె కుటుంబానికి న్యాయం చేయాలని డిమాండ్ చేస్తూ బాధిత కుటుంబ సభ్యులు అటవీ శాఖ రేంజ్ ఆఫీస్ ముందు మృతదేహాన్ని ఉంచి, ప్రధాన రహదారిపై బైఠాయించారు. దీంతో రాకపోకలకు అంతరాయం ఏర్పడింది.