28-03-2025 12:11:32 AM
పొనిశెట్టి వెంకటేశ్వర్లు
పాల్వంచ మార్చి 27(విజయక్రాంతి): కేటీపీఎస్ 6వ దశ నిర్మాణంలో కీలక పాత్ర పోషించిన కార్మికులకు న్యా యం చేయాలని భద్రాద్రి కొత్తగూడెం జిల్లా బిజెపి అధికార ప్రతినిధి పోలీస్ శెట్టి వెంకటేశ్వర్లు డిమాండ్ చేశారు. పాల్వంచ కేటీపీఎస్ అంబేద్కర్ సెంటర్ లో 6 వ దశ నిర్మా ణ కార్మికులు చేస్తున్న దీక్ష కు గురువారం మద్దతు ప్రకటించారు.
అనంతరం దీక్ష చేస్తున్న 6 వ దశ నిర్మాణ కార్మికులను ఉద్దేశించి ఆయన మాట్లాడుతూ గతం లో 6 వ దశ నిర్మాణం పనిచేసిన కార్మికులకు నిర్మాణం అనంతరం ఉద్యోగ అవకాశం కల్పిస్తామని లిఖితపూర్వకంగా హామీ ఇచ్చి మాట తప్పిన జెన్కో యాజమాన్యం విస్మరించిందన్నా రు.
గత ప్రభుత్వం కూడ ఈ కార్మికులకు న్యాయం చేస్తామని మాటలు చెప్పిందే తప్ప వీరికి ఎటువంటి న్యాయం చె య్యలేదన్నారు. నిర్మాణం లో ఎటువంటి సంబంధం లేని వారికీ ఆర్టిజన్ పోస్ట్లు ఇచ్చిన యాజమాన్యం నిర్మాణం లో ప్రాణాలకు తెగించి కష్టబడ్డ వారికీ మాత్రం న్యాయం జరగలేదని అన్నారు.
ఇన్ని సంవత్సరాల నుండి 6 వ దశ కార్మికులు వారి ఉద్యోగాల కోసం పోరాటం చేస్తున్న ఈ ప్రభుత్వాలు పట్టించుకోక పోవడం బాధాకరం అని అన్నారు ఇప్పడి కైనా తక్షణమే ప్రభుత్వం & జెన్కో యాజమాన్యం కార్మికులతో చర్చలు జరిపి వారికీ న్యాయం చెయ్యాలి అని కోరుతున్నాము లేని యడల ఈ కార్మికులు చేసే పోరాటానికి బీజేపీ పార్టీ పూర్తి మద్దతు ఇస్తుందని అన్నారు.
ఈ కార్యక్రమం లో బీజేపీ మాజీ పట్టణ అధ్యక్షులు గంధం ప్రసాద్ గౌడ్,పట్టణ ఉపాధ్యక్షులు బత్తుల వెంకటేశ్వర్లు,పట్టణ ప్రధా న కార్యదర్శి మాదారపు లక్ష్మణ్,ఎస్టీ మోర్చ జిల్లా కార్యదర్శి మాలోత్ ప్రశాంత్ నాయక్ మరియు 6 వ దశ నిర్మాణ కార్మిక సంఘ నాయకులు వాంకుడోత్ హాథిరామ్,బి మురళి ,రెహమాన్, మల్లేష్, తదితరులు పాల్గొన్నారు.