calender_icon.png 19 April, 2025 | 8:46 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

గౌడ కులస్తులకు న్యాయం చేయాలి

09-04-2025 02:05:38 AM

నిజామాబాద్ పోలీస్ కమిషనరేట్, జిల్లా కలెక్టర్ రేట్ ముట్టడి 

నిజామాబాద్ ఏప్రిల్ 8: (విజయ క్రాంతి): నిజమాబాద్ జిల్లా ఎర్గట్ల మండలం తాళ్ల రాంపూర్ గ్రామంలో గౌడ కులస్తులపై గౌడ మహిళలపై విడీసీ కమిటీ  సాంఘిక బహిష్కరణ చేసిన విషయంపై నిజాంమాబాద్ జిల్లా పోలీస్ కమిషనరేట్ కార్యాలయం, జిల్లా కలెక్టర్ కార్యాలయం ముందు తెలంగాణ గౌడ సంఘాల జేఏసీ, మోకుదెబ్బ ఆధ్వర్యంలో ర్యాలీ నిర్వహించి  ధర్నాలు చేయడం జరిగింది.

అనంతరం జిల్లా కలెక్టర్ కు పోలీస్ కమిషనర్ ను  కలిసి ఎర్గట్ల మండలం తాళ్ళరాంపూర్ గ్రామంలోని విడిసి కమిటీ సాంఘిక బహిష్కరణ పై చర్యలు తీసుకోవాలని గౌడ కులస్తులకు న్యాయం చేయాలని వినతి పత్రాన్ని అందజేశారు.  ఈ కార్యక్రమంలో గౌడ హక్కుల పోరాట సమితి మోకుదెబ్బ రాష్ట్ర నాయకులు కోటగిరి రామా గౌడ్ జిల్లా అధ్యక్షులు కోటగిరి అరుణ్ కుమార్ గౌడ్, జిల్లా వర్కింగ్ ప్రెసిడెంట్ చేపూరి జాన గౌడ్ జిల్లా ప్రధాన కార్యదర్శి మెరుగు శ్రీనివాస్ గౌడ్  గౌడ సంఘం జిల్లా అధ్యక్షులు దేగామ్ యాదగౌడ్, మాట్లాడారు.

గౌరవ సామాజిక వర్గం గ్రామ బహిష్కరణ విషయంపై జిల్లా, రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళన కార్యక్రమాలు చేపట్టి ముఖ్యమంత్రి రాష్ట్ర మానవ హక్కుల కమిషన్ చైర్మన్ కు ఫిర్యాదు చేయడం జరుగుతుందన్నారు బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ గౌడ్ టీపీసీసీ అధ్యక్షులు బొమ్మ మహేష్ కుమార్ గౌడ్ గార్ల దృష్టికి తీసుకువెళ్లడం జరుగుతుంది అన్నారు. ఈ వీడీసీ ఆగడాల ను మేధావులు ప్రజలు ప్రజాస్వామిక వాదులు అన్ని కుల వర్గ సంఘాలు తీవ్రంగా ఖండించాలని కోరుతూ తాళ్ళ రాంపూర్ గ్రామ గౌడ కులస్తులకు న్యాయం జరిగే వరకు రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళనలు చెప్పడతామని హెచ్చరించారు.

గ్రామ బహిష్కరణ పాల్పడిన విడిసిని కఠినంగా శిక్షించే విధంగా నాన్ బైబుల్ కేసులు నమోదు చేసి వారిని అరెస్ట్ చేయాలని వారు జిల్లా పోలీస్ శాఖ అధికారిని కోరారు. జిల్లా కలెక్టర్, పోలీస్ కమిషనర్ మాట్లాడుతూ తాళ్ళ రాంపూర్ గ్రామ గౌడ కులస్తులకు న్యాయం జరిగేలా చూసి VౄC కమిటీ సభ్యుల పై రామాలయం పంతులు పై విచారణ జరిపి కఠిన చర్యలు తీసుకుంటాము అని హామీ ఇవ్వడంతో ఆందోళనలు విరమించడం జరిగింది.

ఈ కార్యక్రమంలో  జిల్లా నాయకులు జిల్లా నాయకులు  యాదగౌడ్, రామ గౌడ్, నందిపేట్ యువజన మండల అధ్యక్షుడు సతీష్ గౌడ్, మాక్లూర్ మండలం అధ్యక్షులు దిలీప్ గౌడ్, మోకు దెబ్బ అధ్యక్షులు అరుణ్ గౌడ్, శ్రీనివాస్ గౌడ్, జై గౌడ ఉపాధ్యక్షులు మెరుగు రవీందర్ గౌడ్. బొజ్జ చిన్న గౌడ్, మండల జిల్లా సంఘం నాయకులు భారీ సంఖ్యలో పాల్గొన్నారు.