calender_icon.png 23 March, 2025 | 5:48 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ఎస్సీ, ఎస్టీ ఉద్యోగులకు న్యాయం చేయాలి

22-03-2025 12:00:00 AM

‘ఎస్సీ, ఎస్టీ కమిషన్ మెంబర్ రాంబాబు నాయక్‌కు అజ్మీర రాందాస్ విజ్ఞప్తి

ముషీరాబాద్, మార్చి 21: (విజయక్రాంతి): తెలంగాణ పోలీస్ గృహ నిర్మాణ సంస్థలో ఎస్సీ, ఎస్టీ ఉద్యోగులకు న్యాయం చేయాలని కోరుతూ తెలంగాణ రాష్ట్ర ఎస్సీ, ఎస్టీ కమిషన్ మెంబర్ రాంబాబు నాయక్ కు విజ్ఞప్తి చేసినట్లు తెలంగాణ రాష్ట్ర పోలీస్ గృహ సంస్థ ఎస్సీ, ఎస్టీ ఎంప్లాయీస్ అసోసియేషన్ ఫౌండర్ అజ్మీరా రాందాస్ శుక్రవారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు.

ఆయన మాట్లాడుతూ ఆంధ్రలో రిటైర్డ్ అయిన 70 ఏళ్ల ఆర్.సి కుమార్ గవర్నమెంట్ అప్రూవల్ లేకుండా ఔట్ సోర్సింగ్ పద్ధతిలో రూ.2.50 లక్షల జీతం తీసుకుంటూ గవర్నమెంట్ జీవోకు వ్యతిరేకంగా పనిచేస్తున్నాడని ఆరోపించారు. ప్రభుత్వం వెంటనే ఆర్.సి కుమార్ పై సమగ్ర విచారణ జరిపించి విధుల్లోంచి తొలగించలన్నారు. అలాగే పోలీస్ గృహ సంస్థలో 30 ఏండ్లు గా పనిచేస్తున్న రెగ్యులర్ ఎంప్లాయ్ ని ఆర్.సీ కుమార్ పోస్టులో జనరల్ మేనేజర్ ప్రమోషన్ కల్పించాలన్నారు.

లేనిపక్షంలో ఎస్సీ ఎస్టీ సంఘాల ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున ఉద్యమిస్తామని హెచ్చరించారు. ఎస్సీ, ఎస్టీ ఉద్యోగులపై కక్షగట్టి ఇష్టానుసారంగా వ్యవహరిస్తూ, ఎస్సీ సామాజిక వర్గానికి చెందిన ఒక డిప్యూటి ఈఈ ఎలక్ట్రికల్ పోస్ట్ సాంక్షన్ లేకుండా కూడా క్వాలిటీ కంట్రోల్ లోకి వేయడం జరిగిందన్నారు. ఒక ఎస్టీ సామాజిక వర్గానికి చెందిన డిప్యూటీ ఎగ్జిక్యూటివ్ ఇంజినీర్ రెగ్యులర్ ప్రమోషన్ రాకుండా అడ్డు పడుతున్నాడన్నారు.

ఒక ఎస్టీ ఈఈని సూపరింటెం డెంట్ ఇంజినీర్ ప్రమోషన్ రాకుండా అడ్డు పడుతున్నాడని ఆరోపించారు. ఇతను తప్పు డు డిపిసి అప్రూవ్డ్ చేయించి తన వర్గమైన మహిళ డిఈఈ కి ఈమధ్యనే ప్రమోషన్ కల్పించాడన్నారు. హెడ్ ఆఫీస్లో పనిచేసే ఒక మహిళా ఎఓని డివిజన్ ట్రాన్స్ ఫర్ చేశాడని అన్నారు.

ఇతని వర్గమైన మహిళా ఉద్యోగిని హెడ్ ఆఫీసులో ట్రాన్స్ ఫర్ చేయడం జరిగిందన్నారు. గవర్నమెంట్ జీవో ప్రకారం గౌరవ వేతనం రూ.50 వేలు లేదా రూ.35 వేలు ఇవ్వాలి, కానీ తన జీతం రూ.2.50 లక్షలకు పెంచుకున్నాడని ఆరోపించారు. రెండు సం.లు తెలంగాణ పోలీస్ గృహ సంస్థలో పనిచేసే విధంగా తన ఆర్డర్ తనే తీసుకున్నాడన్నారు.