calender_icon.png 25 April, 2025 | 5:14 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

పార్ట్‌టైం అధ్యాపకులకు న్యాయం చేయాలి

24-04-2025 11:21:12 PM

రాష్ట్ర ప్రభుత్వ సలహాదారు కేకేను కోరిన పార్ట్ టైం అధ్యాపకులు..

హైదరాబాద్ సిటీబ్యూరో (విజయక్రాంతి): రాష్ట్రంలోని వివిధ యూనివర్సిటీల్లో పని చేస్తున్న పార్ట్‌టైం అధ్యాపకులకు న్యాయం చేయాలని పార్ట్ టైం అధ్యాపకుల యూనియన్ నాయకులు రాష్ట్ర ప్రభుత్వ సలహాదారు కే.కేశవరావును కోరారు. గురువారం కేకే నివాసంలో ఆయనను కలిసి వారు వినతిపత్రం అందజేశారు. పార్ట్‌టైం అధ్యాపకులకు మినిమం టైం స్కేల్ ఇస్తూ ఉద్యోగ భద్రత కల్పించాలని విజ్ఞప్తి చేశారు. పార్ట్ టైం అధ్యాపకుల సమస్యలు ప్రభుత్వం దృష్టిలో ఉన్నాయని, పరిష్కరించేందుకు తన వంతు కృషి చేస్తానని కేకే చెప్పారని పార్ట్ టైం అధ్యాపకులు తెలిపారు. ఈ కార్యక్రమంలో పార్ట్ టైం అధ్యాపకుల యూనియన్ నాయకులు డా.తిరునహరి శేషు, డా.దేవోజి నాయక్, డా.భాగ్యమ్మ, డా.శ్రీకాంత్‌ యాదవ్, డా.మోహన్, డా.జ్యోత్స్న, తదితరులు పాల్గొన్నారు.