న్యూఢిల్లీ: రాష్ట్రపతి భవన్‌లో భారత ప్రధాన న్యాయమూర్తిగా సంజీవ్ ఖన్నాతో రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ప్రమాణం చేయించారు. రాష్ట్రపతి ద్రౌపది ముర్ము, ప్రధాని నరేంద్ర మోదీ ఇతర ప్రముఖుల సమక్షంలో రాష్ట్రపతి భవన్‌లో జస్టిస్ సంజీవ్ ఖన్నా భారత 51వ ప్రధాన న్యాయమూర్తిగా బాధ్యతలు స్వీకరించారు. జస్టిస్ సంజీవ్ ఖన్నా 2025 మే 13వరకు సీజేఐగా కొనసాగనున్నారు. సంజీవ్ ఖన్నా ప్రమాణ స్వీకార కార్యక్రమంలో ప్రధాని నరేంద్ర మోదీ, కేంద్రమంత్రులు పదవీ విరమణ చేసిన సీజేఐ డివై చంద్రచూడ్ పాల్గొన్నారు. సీజేఐగా నియమితులైన సంజీవ్ ఖన్నాకు న్యాయ, న్యాయశాఖ మంత్రి అర్జున్ రామ్ మేఘ్వాల్, ఢిల్లీ ఎల్జీ వినయ్ కుమార్ సక్సేనా శుభాకాంక్షలు తెలిపారు.