calender_icon.png 23 October, 2024 | 5:58 AM

కాళేశ్వరం ప్రాజెక్టు బ్యారేజీల అంశంపై జస్టిస్ పీసీఘోష్ కమిషన్ విచారణ

09-07-2024 05:29:00 PM

హైదరాబాద్ : కాళేశ్వరం ప్రాజెక్టు బ్యారేజీల అంశంపై మంగళవారం జస్టిస్ పీసీఘోష్ కమిషన్ విచారణ చేపట్టింది. మేడిగడ్డ, అన్నారం, సుందిళ్ల బ్యారేజీల, పంప్ హౌస్ లపై విచారణ కోనసాగుతుంది. కేంద్ర జల్ శక్తి సలహాదారు శ్రీరాం వెదిరె నుంచి కమిషన్ వివరాలు తీసుకోనున్నట్లు సమాచారం. శుక్రవారం లేదా సోమవారం మళ్లీ రావాలని కమిషన్ కోరింది. గతంలో ఉన్న నీటీపారుదలశాఖ కార్యదర్శులను పిలవనున్న కమిషన్ నిపుణుల కమిటీ నివేదికను జస్టిస్ పీసీ ఘోష్ పరిశీలించారు. కొన్ని డాక్యుమెంట్లు కావాలని,  నివేదికలోని కొన్ని అంశాలపై వివరణ నిపుణుల కమిటీని కోరింది. ఇవాళ జస్టిస్ పీసీ ఘోష్ కమిషన్ మందు  20 మంది నీటీపారుదలశాఖ డిప్యూటీ డీఈలు హాజరయ్యారు. రేపు జస్టిస్ పీసీ ఘోష్ కమిషన్ ముందు ఏఈఈలు హాజరుకానున్నారు.