calender_icon.png 2 November, 2024 | 11:54 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

విచారణ నుంచి తప్పుకున్న జస్టిస్ నరసింహారెడ్డి

16-07-2024 03:01:48 PM

న్యూఢిల్లీ : విద్యుత్ ఒప్పందాలపై విచారణ కమిషన్ ఛైర్మన్ నుంచి జస్టిస్ నరసింహారెడ్డి తప్పుకుంటున్నట్లు లేఖ రాశారు. విద్యుత్ ఒప్పందాల విచారణ కమిషన్ లో అనూహ్య పరిణామాలు చోటు చేసుకున్నాయి. కోర్టులో కేసు విచారణ జరుగుతున్న నేపథ్యంలోనే జస్టీస్ నరసింహారెడ్డి విచారణ నుంచి తప్పుకుంటున్నట్లు ఇచ్చిన లేఖ పత్రాన్ని భోజన విరామ సమయంలో న్యాయవాదులు ద్వారా కోర్టుకు పంపించారు.

జస్టిస్ నరసింహారెడ్డి స్థానంలో మరొకరిని నియమించేందుకు సుప్రీంకోర్టు సమయమిచ్చింది. ఇప్పటికే ఇచ్చిన నోటిఫికేషన్ ప్రకారమే కొత్త జడ్జి నేతృత్వంలో కమిషన్ విచారణ కొనసాగించవచ్చని, రాష్ట్ర ప్రభుత్వం వచ్చే సోమవారం లోపు కమిషన్ కు నూతన ఛైర్మన్ నియమిస్తామన్నారు. సోమవారం లోపు కోర్టుకు వెల్లడిస్తామని అభిషేక్ మనుసింఘ్వీ తెలిపారు. నోటిఫికేషన్ విడుదల చేయాలని ధర్మాసనం ప్రధాన న్యాయవాదులు సూచించారు. కేసీఆర్ దాఖలు చేసిన పిటిషన్ పై విచారణ ముగిసినట్లు సీజేఐ ధర్మాసనం ప్రకటించింది.