calender_icon.png 21 April, 2025 | 6:42 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

అట్రాసిటీ కేసుల్లో బాధితులకు న్యాయం చేయాలి

28-03-2025 12:00:00 AM

  • ఏప్రిల్ 30 లోపు కేసులను పరిష్కరించాలి

సబ్ ప్లాన్ నిధులు పక్కదారి పడితే కఠిన చర్యలు

ఎస్సీ ఎస్టీ కమిషన్ చైర్మన్ బక్కి వెంకటయ్య

ఆదిలాబాద్/గుడిహత్నూర్, మార్చి 27 (విజయక్రాంతి): ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసులను ఏప్రిల్ 30లోపు పరిష్కరించాలని రాష్ట్ర షెడ్యూల్డు కులాలు, షెడ్యూల్డు తెగల కమిషన్ చైర్మన్ బక్కి వెంకటయ్య జిల్లా అధికారుల ఆదేశించారు. ఆదిలాబాద్ జిల్లాలో పర్యటనలో భాగంగా గురువారం జిల్లా కేంద్రానికి వచ్చిన కమిషన్ చైర్మన్‌కు జిల్లా కలెక్టర్ రాజర్షి షా, జిల్లా ఎస్పీ అఖిల్ మహాజన్ పుష్పగుచ్చం అందించి స్వాగతం పలికా రు.

జిల్లాకు వచ్చిన చైర్మన్‌కు ఆయా సంఘా ల నేతలు తమ వినతి పత్రాలు అందజేశా రు. అనంతరం కలెక్టరేట్‌లోని సమావేశ మందిరంలో చైర్మన్‌తో పాటు కమిషన్ సభ్యులు ప్రవీణ్, నీలాదేవి, లక్ష్మి నారాయ ణ, రాంబాబు నాయక్,  శంకర్ అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ, భూ సమస్యల కేసులతో పాటు తదితర వాటిపై సమీక్షించారు.

అనంతరం చైర్మన్ బక్కి వెంకటయ్య మాట్లాడుతూ... ఎస్సీ ఎస్టీ కేసులను త్వరితగతిన పరిష్కరించి బాధితులకు న్యా యం చేయాలన్నారు. ఎస్సీ ఎస్టీ సబ్ ప్లాన్ నిధులు పక్కదారి పడితే కఠిన చర్యలు ఉం టాయన్నారు. ఆదిలాబాద్ జిల్లాపై ప్రత్యేక దృష్టిసారి ఇస్తామన్నారు. ఎస్సీ ఎస్టీలకు ఎలాంటి సమస్య ఉన్న కమిషన్ అండగా ఉంటుందన్నారు.

ఈ సమావేశంలో ఐటీడీ ఏ పీవో ఖుష్బూ గుప్తా, ఎఎస్పీ కాజల్, అదనపు కలెక్టర్ శ్యామలాదేవి, సబ్ కలెక్టర్ యువరాజ్, డీఎస్పీ జీవన్‌రెడ్డి, డీఎఫ్‌ఓ ప్రశాంత్ బాజీరావ్ పాటిల్, ఆర్డీవో వినోద్ కుమార్ తదితరులు పాల్గొన్నారు.

బాధిత కుటుంబాన్ని ఆదుకుంటాం

కొన్ని నెలల క్రితం అత్యాచారానికి గురైన మైనర్ బాలిక కుటుంబానికి అన్ని విధాల ఆదుకుంటామని రాష్ట్ర ఎస్సీ, ఎస్టీ కమిషన్ చైర్మన్ బక్కి వెంకటయ్య అన్నారు. గురువా రం మండల కేంద్రానికి వచ్చిన ఆయనను అధికారులు, దళిత సంఘాల నాయకులు ఘన స్వాగతం పలికారు. ముందుగా అంబేద్కర్, కొమరం భీమ్, అన్నాభాహు సాఠే విగ్రహాలకు పూలమాలవేసి నివాళులర్పించారు.

అనంతరం మైనర్ బాలిక కుటుంబా న్ని ఆమె ఇంటికి వెళ్లి పరామర్శించారు. ఈ సందర్భంగా చైర్మన్ మాట్లాడుతూ..  ఇలాం టి సంఘటనలు జరగడం బాధాకరం, అమానుషం, అనాగరిక చర్య అని అన్నారు. అమ్మాయి కుటుంబానికి కలెక్టర్ ప్రత్యేక నిధి నుండి ఆర్థిక సహాయం చేయాలని తక్షణమే కలెక్టర్‌ను ఆదేశిస్తామన్నారు.

ఈ కేసులో పోలీసులు 22 మందిపై  కేసు నమోదు చేశారని అందులో ఎవరైతే తప్పు చేశారో వారికి తప్పనిసరిగా శిక్ష పడాల్సిందేనని, తప్పు చేయని అమాయకుల మీద ఉన్న కేసులను వెంటనే ఎత్తివేయాలని ఎస్పీకి ఆదేశాలు ఇస్తామన్నారు. ఎస్సీ, ఎస్టీ కమిషన్ సభ్యురా లు నీలాదేవి, తహసీల్దార్ కవితా రెడ్డి, ఎంపీడీవో హైమద్ ఖాన్, దళిత సంఘాల నేతలు ఉన్నారు.