31-03-2025 06:07:49 PM
టేకులపల్లి (విజయక్రాంతి): టేకులపల్లి మండల పాస్టర్ ఫెలోషిప్ కమిటీ ప్రెసిడెంట్ పాస్టర్ బి జాన్ రాజ్, జనరల్ సెక్రెటరీ పాస్టర్ టీ బోయాజ్ పాస్టర్ పగడాల ప్రవీణ్ కుటుంబానికి న్యాయం జరగాలని డిమాండ్ చేశారు. టేకులపల్లిలో సోమవారం బి కాలనీ తండాలో పెంతే కోస్తూ ప్రార్ధన మందిరం పాస్టర్ రాజు రామ్ చందర్ చర్చిలో టేకులపల్లి మండల పాస్టర్ ఫెలోషిప్ కమిటీ సమావేశం జరిగింది. రెండు తెలుగు రాష్ట్రాలు ఆంధ్ర తెలంగాణలోని క్రైస్తవులు ఐక్యత వర్ధిల్లాలన్నారు.
హైదరాబాద్ నుండి బైక్ పై రాజమండ్రి వైపు వెళుతున్న పాస్టర్ ప్రవీణ్ కుమార్ మరణం బాధాకరమని పాస్టర్ మరణంపై పలు అనుమానాలు ఉన్నాయన్నారు. ప్రవీణ్ కుటుంబానికి ఆయన లేని లోటు పూడ్చలేనిదని ప్రగడ సానుభూతి తెలుపుతూ ఆత్మకు శాంతి చేకూరాలన్నారు. ప్రవీణ్ కుటుంబానికి న్యాయం చేకూరే వరకు న్యాయపోరాటం నిర్వహిస్తామన్నారు. ఈ సమావేశంలో కమిటీ పాస్టర్స్ రాజు రామ్ చందర్, కోశాధికారి హానోకు, కార్యవర్గ సభ్యులు దేవరాజ్, సభ్యులు పేతురు, స్టీవెన్, ప్రభుదాస్, రాజ్ కుమార్, దేవదాస్, ఆనంద్, సిస్టర్స్ తారాబాయి, సోనీమ్మ తదితరులు పాల్గొన్నారు.