జిల్లా ఎస్పీ రావుల గిరిధర్
వనపర్తి టౌన్, జనవరి 30 : పోలీసులు విధి నిర్వహణలో అంకిత భావంతో పని చెయ్యాలని, పోలీసింగ్ ఎదురయ్యే సవాళ్లను సమర్థవంతంగా ఎదుర్కోని ప్రజలకు సేవలు అందించాలని బాధతో పోలీసు స్టేషన్కు వచ్చే వారికి భరోసా ఇచ్చేలా విధి నిర్వహణ ఉండాలని ఎస్పీ రావుల గిరిధర్ అన్నారు.
జిల్లాలోని అన్ని పోలీస్టేషన్ల ఏఎస్సైలు, హెడ్ కానిస్టేబుళ్ళతో గురువారం రోజు జిల్లా పోలీసు కార్యాలయంలోని సమావేశ భవనంలో పోలీసు విధులు గురించి మరియు క్రమశిక్షణ తదితర అంశాల గురించి ఎస్పీ దిశా నిర్దేశం చేశారు. ఈ సందర్భంగా ఎస్పీమాట్లాడుతూ.. బాధతో పోలీసు స్టేషన్కు వచ్చే వారికి మేమున్నామనే భరోసా కల్పించాలని దిశానిర్దేశం చేశారు.
మీరు పోలీస్ కాక పొతే బాధితుడికి పోలీస్ ఏలాంటి న్యాయం కావాలని ఆశించారో ఇప్పుడు మీ నుండి బాధితులు ఆ విధంగా న్యాయం కావాలని ఆశిస్తారని వాటిని నెరవేర్చే విధంగా విధులు నిర్వహించాలని సూచించారు.ఎలాంటి ప్రలోభాలకు గురికా కుండా నీతి నిజాయితీతో విధులు నిర్వహిస్తే ప్రజలను ఆదరించాలని .
పోలీస్ శాఖలో ఉద్యోగం అంటేనే అనేక సవాళ్లతో కూడుకున్న ఉద్యోగమని మానసికంగా, శారీరకంగా దఢంగా ఉండాలని సూచించారు. ఈ కార్యక్రమంలో స్పెషల్ బ్రాంచి ఎస్సై, శివకుమార్, జిల్లాలోని ఏఎస్ఐలు, హెడ్ కానిస్టేబుళ్లు, జిల్లా పోలీసు కార్యాలయం సిబ్బంది,తదితరులు పాల్గొన్నారు.