calender_icon.png 19 April, 2025 | 7:50 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

మల్లేశ్వరి కుటుంబానికి న్యాయం చేయాలి

16-04-2025 11:24:03 PM

ప్రేమ పేరుతో మోసం చేసిన నిందితుడికి మరణశిక్ష విధించాలి..

దిల్ సుఖ్ నగర్ లో బహుజన విద్యార్థి సంఘం ఆధ్వర్యంలో ర్యాలీ.. 

ఎల్బీనగర్: ప్రేమ పేరుతో అగ్రకులానికి చెందిన వ్యక్తి మోసం చేయడంతో దళిత కుటుంబానికి చెందిన యువతి ఆత్మహత్య చేసుకున్న ఘటనపై బహుజన విద్యార్థి సంఘం నాయకులు బుధవారం రాత్రి దిల్ సుఖ్ నగర్ నుంచి ముసారాంబాగ్ లోని అంబేద్కర్ విగ్రహం వరకు నిరసన ర్యాలీ నిర్వహించారు. హాస్టల్ విద్యార్థి మళ్లీశ్వరి మృతికి కారణం అయిన నిందితుడిని కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు. ఈ సందర్భంగా విద్యార్థి నాయకులు మాట్లాడుతూ.. దేశంలో కుల వివక్ష నశించాలన్నారు.

ప్రేమించే సమయంలో గుర్తుకు రాని కులం పెండ్లి చేసుకోవాలని అడిగినప్పుడు గుర్తుకు వస్తుందా? అని ప్రశ్నించారు. మల్లేశ్వరిని అగ్రకులానికి చెందిన వ్యక్తి ప్రేమ పేరుతో మోసం చేశాడని, కులం పేరు చెప్పి పెండ్లికి నిరాకరించి, మరో అమ్మాయిని పెండ్లి చేసుకున్నాడని తెలిపారు. ప్రేమించిన వ్యక్తి తనను మోసం చేశాడనే అవమానంతో స్టాప్ నర్సుగా పని చేస్తున్న దళిత యువతి మల్లేశ్వరి ఆత్మహత్య చేసుకున్నట్లు చెప్పారు. మల్లేశ్వరి కుటుంబానికి న్యాయం చేయాలని, నిందితుడికి మరణశిక్ష విధించాలని డిమాండ్ చేశారు.