- నేడు ప్రమాణం చేయించనున్న రాష్ట్రపతి
- 6 నెలలపాటు సీజేఐగా కొనసాగనున్న జస్టిస్ సంజీవ్ ఖన్నా
న్యూఢిల్లీ, నవంబర్ 10: జస్టిస్ సంజీ వ్ ఖన్నా సోమవారం భారత 51వ ప్రధాన న్యాయమూర్తిగా ప్రమాణ స్వీకా రం చేయనున్నారు. రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము రాష్ట్రపతి భవన్‌లో సోమవారం ఉదయం 10 గంటలకు ఖన్నాతో సీజేఐగా ప్రమాణ స్వీకారం చేయించను న్నారు.
ఖన్నా ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత రాష్ట్రపతి భవన్ నుంచి నేరుగా సుప్రీం కోర్టుకు వెళ్లి, కోర్టు నంబర్-1లో సీజేఐ హోదాలో కేసులను విచారిస్తారు. సీజేఐగా డీవై చంద్రచూడ్ పదవీ కాలం నవంబర్ 10న ముగియడంతో ఆయన తర్వాత సుప్రీం కోర్టులో అత్యం త సీనియర్ న్యాయమూర్తిగా ఉన్న ఖన్నాకు సీజేఐగా బాధ్యతలు స్వీకరించే అవకాశం దక్కింది. కాగా, 370 ఆర్టికల్ రద్దు, ఎలక్టోరల్ బాండ్ల రద్దు వంటి కీలక తీర్పులు ఇచ్చిన ధర్మసనాల్లో ఖన్నా సభ్యుడిగా ఉన్నారు.
ఖన్నా ప్రస్థానం
జస్టిస్ సంజీవ్ ఖన్నా ప్రస్థానం జిల్లా కోర్టు నుంచి మొదలై సుప్రీంకోర్టు వరకు సాగింది. ఆయన ఢిల్లీలోని ప్రముఖ న్యాయమూర్తుల కుటుంబంలో 1960 మే 14న జన్మించారు. ఢిల్లీ హైకోర్టు న్యాయమూర్తిగా పనిచేసిన దేవ్‌రాజ్‌ఖన్నా కుమారుడే సంజీ వ్ ఖన్నా. ఢిల్లీ యూనివర్సిటీ నుంచి డిగ్రీ పట్టా పొందారు. అనంతరం అదే యూనివర్సిటీలో న్యాయవిద్యను అభ్యసించారు.
1983లో న్యాయవాదిగా ఢిల్లీ బార్ కౌన్సిల్‌లో చేరారు. తమ కెరీర్ మొదట్లో తీస్ హజారీ కోర్టులో న్యాయవాదిగా ప్రాక్టీస్ చేశారు. 2004లో ఢిల్లీ ప్రభుత్వం తరఫున నేషనల్ క్యాపిటల్ టెరిటరీకి స్టాండింగ్ కౌన్సెల్‌గా నియమితులయ్యారు. ౨౦౦౫లో ఢిల్లీ హైకోర్టు అదనపు న్యాయమూర్తిగా, 2006 నుంచి శాశ్వత న్యాయమూర్తిగా కొనసాగా రు. 2019 జనవరి 18న సుప్రీంకోర్టు న్యాయమూర్తిగా ఖన్నా పదోన్నతి పొందా రు.
ఈ క్రమంలోనే ఈవీఎంలను పని తీరును సమర్థ్ధిస్తూ గతంలో ఆయన నేతృత్యవంలోని ధర్మాసనం తీర్పు వెలువరించింది. కొద్ది రోజుల క్రితం ఎన్నికల వేళ ఢిల్లీ మాజీ సీఎం అరవింద్ కేజ్రీవాల్‌కు మధ్యంతర బెయిల్ ఇచ్చింది కూడా సంజీవ్ ఖన్నా నేతృత్వంలోని ధర్మాసనమే.