calender_icon.png 30 April, 2025 | 7:00 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

మే 14 నుంచి సీజేఐగా జస్టిస్ గవాయ్

30-04-2025 12:59:35 AM

  1. నియామకానికి ఆమోదముద్ర వేసిన రాష్ట్రపతి

ప్రకటించిన కేంద్ర న్యాయశాఖ మంత్రి మేఘ్వాల్

మే 13న పదవీ విరమణ చేయనున్న ప్రస్తుత సీజేఐ సంజీవ్ ఖన్నా

న్యూఢిల్లీ, ఏప్రిల్ 29: జస్టిస్ భూషణ్ రామకృష్ణ గవాయ్ మే 14న భారత సుప్రీం కోర్టు 52వ ప్రధాన న్యాయమూర్తిగా బాధ్యతలు స్వీకరించనున్నారు. ఆ యన నియామకానికి సంబంధించి మంగళవారం రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఆమోదం తెలిపారు. భారత న్యాయశా ఖ మంత్రి అర్జున్ రామ్ మేఘ్వాల్ ఇం దుకు సంబంధించిన వివరాలను ఎక్స్ ద్వారా వెల్లడించారు.

‘భారత రాజ్యాం గం ద్వారా సంక్రమించిన అధికారాల మేరకు గవాయ్‌ని మే 14 నుంచి భారత సుప్రీం కోర్టు ప్ర ధాన న్యాయమూర్తిగా నియమించడం ఆనందంగా ఉంది’ అని మంత్రి ఎక్స్‌లో పేర్కొన్నారు. ప్రస్తుతం సీజేఐగా విధులు నిర్వర్తిస్తున్న సంజీవ్ ఖన్నా మే 13న పద వీ విరమణ చేయనున్నారు.

52వ సీజేఐగా బాధ్యతలు చేపట్టనున్న బీఆర్ గవా య్ 6 నెలల పాటు మాత్రమే ఆ పోస్టు లో కొనసాగనున్నారు. నవంబర్ 2025 లో గవాయ్ పదవీకాలం పూర్తవనుంది. బాలకృష్ణన్ అనంతరం సీజేఐగా పదవి చేపట్టనున్న రెండో దళిత వ్యక్తి గవాయ్ కావడం గమనార్హం. సుప్రీం కోర్టులో వి ధులు నిర్వర్తిస్తున్న సీనియర్ న్యాయమూర్తిని సీజేఐ పదవికి సిఫారసు చేస్తారు.