calender_icon.png 28 February, 2025 | 1:24 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

అన్ని దానాల్లో కెల్లా అన్నదానం మిన్న: న్యాయమూర్తి జి. భానుమతి

27-02-2025 09:20:39 PM

పాల్వంచ,( విజయక్రాంతి): అన్ని దానాల్లో కెల్లా అన్నదానం మిన్న అని జిల్లా లీగల్ సర్వీసెస్ అథారిటీ సెక్రటరీ, న్యాయమూర్తి జి. భానుమతి(Justice G. Bhanumathi) అన్నారు. గురువారం పాల్వంచ పట్టణ పరిధి వనమా కాలనీలోని శ్రీశ్రీశ్రీ పార్వతీ సమేత రామలింగేశ్వర స్వామి దేవాలయం(Sri Sri Sri Parvati Sametha Ramalingeswara Swamy Temple)లో మహాశివరాత్రిని పురస్కరించుకొని అన్నప్రసాద కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన న్యాయమూర్తి జి. భానుమతి ఆలయంలో ప్రత్యేక పూజలు చేసి అన్నప్రసాద కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ అన్ని దానాల కంటే అన్నదానం మేలని, అలాంటిది ప్రతియేటా శివరాత్రి అనంతరం వనమా కాలనీలోని శివాలయంలో వందలాది మందికి అన్నదానం నిర్వహించడం అభినందించదగ్గ విషయమని తెలిపారు.ఈ కార్యక్రమంలో సీనియర్ న్యాయవాది మెండు రాజమల్లు, నేతాజీ యువజన సంఘం వ్యవస్థాపక అధ్యక్షుడు ఎస్. జె. కె. అహ్మద్, వనమా కాలనీ శివాలయం కమిటీ బాధ్యులు ఏ. వి. రాఘవ, జె. రమణ, పావురాల ప్రసాద్, ఎం. సంతోష్, ఓంకారం వంశి వర్ధన్ రాజు, జడ్డు అప్పలనాయుడు, రౌతు చిమ్మి నాయుడు తదితరులు పాల్గొన్నారు.