ఎమ్మెల్యే కసిరెడ్డి నారాయణరెడ్డి
కడ్తాల్, జనవరి 22 (విజయక్రాంతి): ప్రజా పాలనలో అర్హులైన పేదలందరికి సంక్షేమ పథకాలు అందించడమే ప్రభుత్వ లక్ష్యమని కల్వకుర్తి ఎమ్మెల్యే కసిరెడ్డి నారాయణరెడ్డి అన్నారు. కడ్తాల్ మండల కేంద్రంతో పాటు ఆమనగల్లు మండలం పోలేపల్లి, మాడ్గుల మండలం ఆవురుపల్లి గ్రామాల్లో బుధవారం నిర్వహించిన ప్రజా పాలన గ్రామ సభలో ముఖ్యఅతిథులుగా ఎమ్మెల్యే కసిరెడ్డి నారాయణరెడ్డి హాజరై ప్రసంగించారు.
గత ప్రభుత్వ హయంలో సంక్షేమ పథకాలు అనర్హులకు అందాయని లెక్కలతో సహ వివరించారు. అదేవిదంగా గత ప్రభుత్వ 10 సంవత్సరాల పాలనలో ఒక్క రేషన్ కార్డు ఇచ్చిన పాపాన పోలేదని ,డబల్ బెడ్రూం ఇండ్లు ఇస్తామని చెప్పి బిఆర్‌ఎస్ అధికారంలోకి వచ్చిన ఒక్క ఇళ్లు కుడా ఇవ్వాలేదని దుయ్యబట్టారు.
అందుకే ప్రజలు కాంగ్రేస్ పార్టీని అధికారంలోకి తెచ్చారని చెప్పారు. కాంగ్రెస్ పార్టీ ఎన్నికల ముందు ప్రజల కిచ్చిన హామీలన్నీ అమలు చేసి తీరుతామని ఎమ్మెల్యే అన్నారు. ఈ కార్యక్రమంలో మార్కెట్ కమిటీ చైర్ పర్సన్ గీత నర్సింహా, వైస్ చైర్మన్ భాస్కర్ రెడ్డి, ఆయా మండల అధికారులు, ప్రజాప్రతినిధులు, నాయకులు, ప్రజలు పాల్గొన్నారు.