calender_icon.png 23 April, 2025 | 4:15 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

భూభారతి చట్టంతో సామాన్యులకు న్యాయం

23-04-2025 01:07:48 AM

కలెక్టర్ అధ్వైత్ కుమార్ సింగ్, ఎమ్మెల్యే మురళీనాయక్

 గూడూరు. ఏప్రిల్  22: (విజయక్రాంతి) భూభారతి నూతన ఆర్‌ఓఆర్ చట్టం 2025 ద్వారా సామాన్యులకు ప్రజలకు న్యాయం జరుగుతుందని జిల్లా కలెక్టర్ అండ్ మెజిస్ట్రేట్ అద్విత్ కుమార్ సింగ్ అన్నారు మంగళవారం మహబూబాబాద్ జిల్లా గూడూరు మండలం భూపతి పేట గ్రామ రైతు వేదికలో ఎమ్మెల్యే మురళి నాయక్ తో కలిసి హాజరయ్యారు.

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకుని భూభారతి ఆర్ ఓ ఆర్ చట్టం రూపొందించిందని దాని ప్రకారం దరఖాస్తు చేసుకున్న భూ సమస్యలు కలిగిన ప్రతి ఒక్కరికి న్యాయం జరిగేలా చర్యలు తీసుకుంటామని అన్నారు. రైతులకు ఉచిత న్యాయ సహాయం సేవలు అందించడం జరుగుతుందని హక్కులు రిజిస్టర్ నిర్వహణ ప్రకారం రైతు యొక్క ఆధార్ లింక్ ద్వారా భూదార్ నెంబర్ కేటాయించడం జరుగుతుందని అన్నారు. 

ధరణి హోటల్ నన్ను మోసం చేసింది

గత ప్రభుత్వం ప్రవేశపెట్టిన ధరణి పోర్టల్ లో అనేక లోపాలు ఉన్నాయని దాని ద్వారా తాను సైతం వ్యక్తిగతంగా మోసపోవడం జరిగిందని మానుకోట ఎమ్మెల్యే భూక్య మురళి నాయక్ అన్నారు. అయితే కాంగ్రెస్ ప్రభుత్వం సామాన్య రైతులకు ప్రజలకు న్యాయం జరిగే విధంగా ఉండేందుకు ముఖ్యమంత్రి భూభారతి నూతన రెవిన్యూ చట్టాన్ని ప్రవేశపెట్టడం జరిగిందని తద్వారా ఈ నూతన చట్టం ద్వారా పక్కా న్యాయం జరుగుతుందని అన్నారు.

రైతు రమేష్ అడిగిన ప్రశ్నలకు జిల్లా కలెక్టర్ ఎమ్మెల్యే డాక్టర్ మురళి నాయక్ సమాధానం చెప్పి భూభారతి చట్టం ద్వారా సమస్య పరిష్కారం అలుస్తాయని తెలిపారు ఈ కార్యక్రమంలో వ్యవసాయ శాఖ అధికారి విజయనిర్మల శ్రీనివాస్ స్థానిక తాసిల్దార్ చంద్రశేఖర్ ఎంపీడీవో వీరస్వామి గూడూరు వ్యవసాయ శాఖ అధికారి అబ్దుల్ మాలిక్  సంబంధిత అధికారులు రైతులు పాల్గొన్నారు.