calender_icon.png 16 January, 2025 | 2:23 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

కుల గణనతోనే బీసీలకు న్యాయం

11-09-2024 12:26:46 AM

రాష్ట్ర గౌడ కల్లుగీత సంఘాల కమిటీ చైర్మన్ బాలరాజుగౌడ్ 

హైదరాబాద్,సెప్టెంబర్ 9 (విజయక్రాంతి): మూడు నెలల్లో బీసీ కుల గణన చేయాలని హైకోర్టు ఇచ్చిన తీర్పుతో బడుగు, బలహీన వర్గాల ప్రజలకు రాజకీయంగా న్యాయం జరుగుతుందని తెలంగాణ గౌడ కల్లుగీత సంఘాల సమన్వయ కమిటీ చైర్మన్ బాలగౌని బలారాజు గౌడ్ ఆశాభావం వ్యక్తం చేశారు. పీసీసీ అధ్యక్ష పదవిని మహేష్‌కుమార్ గౌడ్‌కు అప్పగించడం హర్షణీయమన్నారు. హైదరాబాద్‌లోని రాష్ట్ర గౌడ కల్లుగీత సంఘాల కమిటీ కార్యాలయంలో నిర్వహించిన విలేకర్ల సమావేశంలో ఆయన మాట్లాడారు.

ఈ నెల 15న గాంధీభవన్‌లో జరుగనున్న పీసీసీ చీఫ్ మహేష్‌కుమార్‌గౌడ్ ప్రమాణ స్వీకారానికి వేలాదిగా గౌడ కులస్తులు తరలి రావాలని పిలుపునిచ్చారు. సుమారు 30 ఏళ్ల తర్వాత గౌడ సామాజిక వర్గానికి పీసీసీ పదవి వచ్చిందని గుర్తుచేశారు. ఈ సందర్భంగా కాంగ్రెస్ అగ్రనేతలు సోనియాగాంధీ, రాహుల్‌గాంధీ, మల్లిఖార్జున ఖర్గే, సీఎం రేవంత్‌రెడ్డితో పాటు మంత్రులకు కృతజ్ఞతలు తెలుపుతున్నామన్నారు. సమావేశంలో సంఘం వర్కింగ్ ప్రెసిడెంట్ ఎలికట్టె విజయ్‌కుమార్‌గౌడ్, రాష్ట్ర కన్వీనర్ అయిలి వెంకన్న గౌడ్, వర్కింగ్ ప్రెసిడెంట్ బాలగౌని వెంకటేష్ గౌడ్, ఇతర నాయకులు అంబాల నారాయణగౌడ్, పోతగాని ఐలన్నగౌడ్ పాల్గొన్నారు.