calender_icon.png 11 January, 2025 | 4:19 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

బీఎస్పీతోనే బహుజనులకు న్యాయం

05-08-2024 12:51:44 AM

బీఎస్పీ సెంట్రల్ కో ఆర్డినేటర్ అశోక్ 

హైదరాబాద్, ఆగస్టు 4 (విజయక్రాంతి): బహుజనుల కోసం పోరాడేది బీఎస్పీ మాత్రమేనని బీఎస్పీ సెంట్రల్ కో ఆర్డినేటర్, మాజీ ఎంపీ అశోక్ సిద్ధార్థ్ అన్నారు. వారికి న్యాయం జరిగేది బీఎస్పీ వల్లేనని అన్నారు. అణగారినవర్గాలను అణచివేసి, పేదరికంలో చిక్కుకునేలా రాజకీయ పార్టీలు చేశాయని ఆయన ఆరోపించారు. హైదరాబాద్ బీఎస్పీ కార్యాలయంలో జరిగిన ఏపీ, తెలంగాణ పార్టీ నేతల సమావేశంలో అశోక్ ప్రసంగించారు.

అప్పుడు కాంగ్రెస్, ఇప్పుడు బీజేపీతోపాటు ఏపీ, తెలంగాణను ఏలిన ప్రాంతీయ పార్టీలు ప్రజలను మోసం చేస్తూనే ఉన్నాయన్నారు. ఎస్సీ వర్గీకరణను బీజేపీ రాజకీయంగా వాడుకుంటోందని బీఎస్పీ అధినేత మాయావతి తెలిపారని వెల్లడించారు. కార్యక్రమంలో పార్టీ ఏపీ కోఆర్డినేటర్ రిటైర్డ్ డీజీపీ పూర్ణచంద్రరావు, బడంగ్‌పేట డిప్యూటీ మేయర్ ఇబ్ర హీంశేఖర్, మాజీ ఎమ్మెల్యే రాజారావు, బాలయ్య, నితిన్‌సింగ్, వందనకుమార్ పాల్గొన్నారు.