calender_icon.png 26 November, 2024 | 6:01 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

కులగణనతోనే అందరికీ న్యాయం

06-11-2024 01:17:38 AM

పలువురితో రాహుల్‌గాంధీ సంప్రదింపులు: డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క 

హైదరాబాద్, నవంబర్ 5 (విజయక్రాంతి): కులగణనతోనే అందరికీ న్యాయం జరుగుతుందని రాహుల్‌గాంధీ ఎప్పుడో చెప్పారని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క అన్నారు. కులగణన సర్వేలో సమాజంలోని అన్ని వర్గాలను పొందుపరచాలని, అందుకు వారిని ఏ ప్రశ్నలు అడ గాలి, ఏ సమాచారం సేకరించాలి వంటి అంశాలు తెలుసుకునేందుకు తెలంగాణ సమాజంలోని మేధావులు, సామాజికవేత్తలతో రాహుల్‌గాంధీ సంప్రదింపులు జరుపుతున్నారని తెలిపారు.

వారి సలహాలు, సూచనలు తీసుకొని సర్వేలో ప్రశ్న లు పొందుపరిచి సమగ్ర సమాచారం సేకరిస్తామన్నారు. పీసీసీ ఆధ్వర్యంలో బోయి న్‌పల్లిలోని గాంధీ ఐడియాలజీ సెంటర్ లో కులగణనపై మేధావులు, సామాజికవేత్తలతో నిర్వహించిన ముఖాముఖి కార్యక్ర మంలో డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క మాట్లాడారు.

మంగళవారం భారతదేశ చరిత్రలో సువర్ణ అక్షరాలతో లిఖించదగిన రోజని అన్నారు. కాశ్మీర్ నుంచి కన్యాకుమారి వరకు రాహుల్‌గాంధీ అన్నివర్గాల ను కలుపుకొని సుదీర్ఘ పాదయాత్ర చేసి దేశంలోని వనరులు, సంపద సమాన స్థా యిలో అందరికీ అందుబాటులోకి తెచ్చేందుకు కులగణనతో న్యాయం జరుగుతుం దని బలంగా విశ్వసించారని తెలిపారు.

తెలంగాణ నుంచే కులగణన..

 తెలంగాణలో కాంగ్రెస్ అధికారంలోకి రాబోతుందని, ఇక్కడినుంచి కులగణన ప్రారంభిస్తామని రాహుల్‌గాంధీ ఎన్నికల సభల్లో ప్రకటించిన విషయాన్ని ఆయన గుర్తు చేశారు. కులగణన అంశంలో దేశానికి దశ, దిశ చూపడానికి అధికారంలోకి వచ్చిన నాటి నుంచి రాహుల్‌గాంధీ ఆలోచన మేరకు సీఎం రేవంత్‌రెడ్డితోపాటు క్యాబినేట్ మొత్తం ఈ అంశంపై పనిచేయ డం ప్రారంభించిందని తెలిపారు.

కుల గ ణనపై శాసనసభలో ఏకగ్రీవంగా తీర్మా నం చేసి దాన్ని జీవోగా మార్చి ప్రణాళికా శాఖ ద్వారా సమాజం ముందు పెట్టామని వివరించారు. కులగణన అంశంపై గాంధీభవన్‌లో ఇప్పటికే కీలక నేతలతో సమా లోచనలు జరిపామని, పీసీసీ అధ్యక్షుడు మహేశ్ కుమార్ ఆదేశాల మేరకు జిల్లా కాంగ్రెస్ కమిటీలు సమావేశమై సమాచారం సేకరించారని  భట్టి పేర్కొన్నారు.