calender_icon.png 3 November, 2024 | 3:07 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

సమగ్ర సర్వేతో అన్ని వర్గాలకు న్యాయం

03-11-2024 12:59:49 AM

  1. కుటుంబ సర్వేపై ప్రజలకు అవగాహన కల్పించాలి
  2. బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్

కరీంనగర్, నవంబరు 2 (విజయక్రాంతి): అన్ని వర్గాల ప్రజలకు న్యాయం చేసేందుకే కాంగ్రెస్ ప్రభుత్వం సమగ్ర కుటుంబ సర్వే చేపడుతున్నదని బీసీ సంక్షేమ, రవాణా శాఖ ల మంత్రి పొన్నం ప్రభాకర్ అన్నారు. శనివారం కరీంనగర్‌లోని జిల్లా కాంగ్రెస్ కార్యా లయంలో డీసీసీ అధ్యక్షుడు, మానకొండూర్ ఎమ్మెల్యే కవ్వంపల్లి సత్యనారాయణ అధ్యక్షతన సమగ్ర కుటుంబ సర్వే నిర్వహణపై సమావేశం ఏర్పాటు చేశారు.

ఈ సం దర్భంగా మంత్రి పొన్నం మాట్లాడుతూ.. కామారెడ్డి డిక్లరేషన్‌లో భాగంగానే కుల గణ న చేపడుతున్నామని, నిరంజన్ చైర్మన్‌గా ముగ్గురు సభ్యులతో బీసీ కమిషన్ ఏర్పాటు చేశామని చెప్పారు. కరీంనగర్ జిల్లాలో 3 లక్షల 70 వేల ఇళ్లకు 2500 మంది సర్వే చేస్తారని తెలిపారు. జిల్లా కాంగ్రెస్ అధ్యక్షుడు, ఇతర నేతలు సర్వేపై ప్రజలకు అవగా హన కల్పించాలని సూచించారు.

కాగా కేంద్ర మంత్రులుగా బండి సంజయ్, కిషన్‌రెడ్డి రాష్ట్రానికి ఏం చేశారో చెప్పాలన్నారు. ఈ జిల్లా మంత్రిగా అండగా ఉంటానని, పనిచేసిన ప్రతి ఒక్కరికీ న్యాయం జరుగుతుం దని చెప్పారు. ఎక్కడ అవినీతి జరిగినా చర్య లు తీసుకునే సానుకూల వాతావరణం కల్పిస్తున్నామన్నారు.

నాలుగైదు రోజుల్లో నియో జకవర్గాల వారీగా సమావేశాలు ఏర్పాటు చేసి వారి సమస్యలు తెలుసుకుంటామని పార్టీ శ్రేణులకు మంత్రి పొన్నం ప్రభాకర్ హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో నాయకులు బొమ్మ శ్రీరాం చక్రవర్తి, వైద్యుల అం జన్‌కుమార్, సమద్ నవాబ్, ఎండి తాజ్, పులి ఆంజనేయులుగౌడ్ పాల్గొన్నారు. 

పలు జిల్లాలో సమావేశాలు

నల్లగొండ/మంచిర్యాల/కామారెడ్డి/పెద్దపల్లి, నవంబర్ 2 (విజయక్రాంతి): పెద్దపల్లి జిల్లా కేంద్రంలో కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షుడు, ఎమ్మెల్యే మక్కాన్‌సింగ్ ఆధ్వర్యంలో కుల గణనపై సమావేశం నిర్వహించారు. సమావేశంలో పెద్దపల్లి, రామగుండం ఎమ్మెల్యేలు విజయరమణారావు, మక్కాన్ సింగ్ రాజ్‌ఠాకూర్, జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ అంతటి అన్నయగౌడ్, రామగుండం మేయర్ అనిల్‌కుమార్, మంథని విభాగ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు తొట్ల తిరుపతి యాదవ్ పాల్గొన్నారు.

కామారెడ్డిలో జాతీయ బీసీ సంక్షేమ సంఘం జిల్లా కార్యాలయంలో బీసీ ముఖ్య నాయకుల సమావే శం నిర్వహించారు. జాతీయ బీసీ సంక్షేమ సంఘం జిల్లా అధ్యక్షుడు చింతల శంకర్, ఉపాధ్యక్షుడు కాముని సుదర్శన్ పాల్గొన్నారు. మంచిర్యాల జిల్లా కేంద్రంలో డీసీసీ అధ్యక్షురాలు కొక్కిరాల సురేఖ నిర్వహించిన విస్తృత స్థాయి సమావేశానికి పెద్దపల్లి ఎంపీ గడ్డం వంశీకృష్ణ, మంచిర్యాల ఎమ్మెల్యే కొక్కిరాల ప్రేంసాగర్‌రావు పాల్గొని మాట్లాడారు.

నల్లగొండలో డీసీసీ అధ్యక్షుడు కేతావత్ శంకర్‌నాయక్ అధ్యక్షతన నిర్వహించిన కార్యక్రమంలో ఎమ్మెల్యేలు నేనావత్ బాలూ నాయక్, బత్తుల లక్ష్మారెడ్డి, వేముల వీరేశం, కుందూరు జైవీర్‌రెడ్డి, టీపీసీసీ ప్రధాన కార్య దర్శి కొండేటి మల్లయ్య పాల్గొన్నారు. 

కేటీఆర్.. పదేళ్ల కింద నీ ఆస్తులెంతా?

  1. దీనికి సమాధానం చెప్పి పాదయాత్ర చెయ్
  2. స్టేషన్‌ఘన్‌పూర్ ఎమ్మెల్యే కడియం శ్రీహరి

జనగామ, నవంబర్ 2 (విజయక్రాం తి): పదేళ్ల పాలనలో బీఆర్‌ఎస్ అందినకాడి దోచుకుందని, కేసీఆర్ కుటుంబ ఆస్తులు అమాంతం పెరిగాయని స్టేషన్‌ఘన్‌పూర్ ఎమ్మెల్యే కడియం శ్రీహరి విమర్శించారు. పదేళ్ల క్రితం అఫిడవిట్ లో కేటీఆర్ చూపించిన ఆస్తులెంతున్నాయో, ఇప్పుడెంత ఉన్నాయో స్పష్టం చేయాలని సవాల్ విసిరారు.

శనివారం సమగ్ర ఇంటింటి సర్వేపై జనగామలో నిర్వహించిన అవగాహన కార్యక్రమం లో ఆయన మాట్లాడారు. కేటీఆర్ తన ఆస్తుల వివరాలు వెల్లడించి రాష్ట్రంలో పాదయాత్ర చేయాలన్నారు. కాంగ్రెస్‌ను బదనాం చేసేందుకు బీఆర్‌ఎస్ భారీగా డబ్బు ఖర్చు చేసి సోషల్ మీడియాలో తప్పుడు పోస్టులు పెట్టిస్తోందని విమర్శించారు.

ఉనికి కోసం కేటీఆర్, హరీ శ్‌రావు పోటీపడి ప్రెస్‌మీట్‌లు పెడుతున్నారని, అదే దారిలో బీజేపీలో బండి సంజయ్, కిషన్‌రెడ్డి, ఈటల రాజేందర్ వెళ్తున్నారని ఎద్దేవా చేశారు. తెలంగాణ లో కాంగ్రెస్ చేపట్టిన సమగ్ర కుటుంబ సర్వే ప్రతిష్ఠాత్మక కార్యక్రమమని కొనియాడారు. మరో పదేళ్లు కాంగ్రెస్‌కు అవకాశం ఇవ్వాలని, దేశంలోనే తెలంగాణ రోల్ మోడల్‌గా కానుందన్నారు.

దేశంలో కుల గణన చేసే దమ్ము బీజేపీకి ఉందా అని ప్రశ్నించారు. తెలంగాణకు రూ.50 వేల కోట్ల గ్రాంట్లు తీసుకువస్తేనే బీజేపీకి ఇక్కడి ప్రజలు నమ్ముతారన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం సంక్షేమం, అభివృద్ధి పనులతో దూసుకెళ్తోందని భువనగిరి ఎంపీ చామల కిరణ్‌కుమార్‌రెడ్డి అన్నారు. ఈ కార్యక్రమంలో పాలకుర్తి ఎమ్మెల్యే యశస్వినిరెడ్డి, వరంగల్ ఎంపీ కడియం కావ్య, డీసీసీ అధ్యక్షుడు కొమ్మూరి ప్రతాప్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు.

అభిప్రాయ సేకరణలో రభస

కుమ్రంభీం ఆసిఫాబాద్, నవంబర్ 2 (విజయక్రాంతి): ఆసిఫాబాద్ జిల్లా కేంద్రంలో శనివారం కాంగ్రెస్ పార్టీ నిర్వహించిన కులగణనపై అభిప్రాయ సేకరణ కార్యక్రమం రసాభాసగా మారింది. డీసీసీ అధ్యక్షుడు విశ్వప్రసాద్, ఆసిఫాబాద్ నియోజకవర్గ ఇన్‌చార్జి శ్యాంనాయక్ వర్గీయుల మధ్య వాగ్వాదం జరగడంతో ఒక్కరిపై ఒకరు కుర్చీలు విసురుకున్నారు.

ఒకరిపై ఒకరు దాడులు చేసుకోవడంతో కార్యకర్త గడ్డల సత్తయ్యకు గాయాలయ్యా యి. పోలీసులు కల్పించుకొని శ్యాంనాయక్‌తో పాటు ఆయన వర్గీయులను సమావేశం నుంచి బయటకు పంపించారు. దీంఓ రోడ్డుపై బైఠాయించి డీసీసీ అధ్యక్షుడు విశ్వప్రసాద్‌కు వ్యతిరేకంగా నినాదాలు చేశారు.

కాగజ్‌నగర్ డీఎస్పీ రామానుజం నచ్చజెప్పే ప్రయత్నం చేసి నా వినకపోవడంతో శ్యాంనాయక్‌తోపా టు ఆయన వర్గీయులను పోలీస్ స్టేషన్‌కు తరలించారు. కులగణనపై ఏర్పాటు చేసి న సమావేశంలో ఎమ్మెల్సీ దండె విఠల్, మాజీ ఎంపీపీ బాలేష్‌గౌడ్, అనిల్‌గౌడ్ పాల్గొన్నారు.