calender_icon.png 4 April, 2025 | 3:09 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

నన్ను నాలా గుర్తిస్తే చాలు!

03-04-2025 12:00:00 AM

‘కొందరు దీన్ని విధి అంటారు.. మనం మాత్రం రాహుకేతువుల ఆట అంటాం. ఏదేమైనా అది త్వరలో మీ జీవితంలోకి కూడా ప్రవేశించిం ది’ అంటూ రాసుకొచ్చింది ‘అర్జున్‌రెడ్డి’ బ్యూటీ షాలినీ పాండే.  రాహుకేతువులు మన జీవితంలోకి ప్రవేశించడమేంటీ? అనుకుంటున్నారా? విషయం ఏంటంటే.. ‘రాహుకేతు’ అనే చిత్రంలో షాలినీ పాండే నటిస్తోంది. ఈ సినిమా షూటింగ్ ప్రారంభమైంది.

ఈ విషయాన్ని షాలినీ ఇలా తన ఇన్‌స్టా ద్వారా వెల్లడించింది. జీ స్టూడియోస్ కొత్త ప్రాజెక్టు ‘రాహుకేతు’ విపుల్ విగ్ దర్శకత్వంలో రూపుదిద్దుకుంటోంది. ఈ సినిమాలో పులకిత్ సామ్రా ట్ ప్రధాన పాత్రలో నటిస్తున్నాడు. వరుణ్‌శర్మ కీలక పాత్రల్లో కనిపించనున్నాడు. షాలినీ ఇటీవల ఇచ్చిన ఓ ఇంటర్వ్యూలో తనను బాలీవుడ్ నటి అలియాభట్‌తో పోల్చడంపై స్పందించింది.

‘ప్రేక్షకులు నన్నెంతగానో ప్రేమిస్తున్నారు. వారి ప్రేమాభిమానాలు వెలకట్టలేనివి. కొంత మంది నన్ను నటి అలియాభట్‌తో పోలుస్తూ తమ ప్రేమను వ్యక్తపరుస్తున్నారు. మనకు ఇండస్ట్రీ లో ఇప్పటికే ఒక అలియా ఉన్నారు.

కాబట్టి, ఆమెలా మరొకరు అవసరంలేదు. ఆమెలా ఉండాలని ఇంకొకరు కోరుకోరు. ఆమె అద్భుతమైన నటి. నిజ జీవితంలో ఎంతో ఉన్నతంగా ఉంటారు. నేనూ ఆమె నుంచి ఎంతో స్ఫూరి పొందుతుంటా. ఎన్నో విషయాలు నేర్చుకోవాలనుకుంటా. అయితే ఆమెతో పోల్చి చూస్తుంటే మాత్రం పెద్దగా నచ్చదు. నన్ను నాలా గుర్తిస్తే చాలు. నాకంటూ ఒక గుర్తింపు తెచ్చుకోవాలనేది నా ఉద్దేశం’ అని షాలినీ పాండే తెలిపింది.