- ప్రభుత్వ వైఫల్యాలపై ప్రశ్నిస్తే దాడులా?
- భూపాల్‌రెడ్డిపై కాంగ్రెస్ నాయకుల దాడి సిగ్గుచేటు
- నల్లగొండలో మంత్రి కోమటిరెడ్డి రౌడీయిజం
- మాజీ మంత్రి జగదీశ్‌రెడ్డి ఆగ్రహం
నల్లగొండ, జనవరి 21 (విజయక్రాంతి): కేటీఆర్ ఫొటో చూసినా, గులా బీ రంగు చూసినా మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి వెన్నులో వణుకు పుడుతున్నదని మాజీ మంత్రి జగదీశ్‌రెడ్డి ఎద్దేవా చేశారు. మంత్రికి కేటీఆర్ ఫోబియా పట్టుకున్నదని పేర్కొన్నారు. నల్లగొండలోని బీఆర్‌ఎస్ కార్యాలయంలో ఆ పార్టీ జిల్లా అధ్యక్షుడు బడు గుల లింగయ్యయాదవ్‌తో కలిసి మంగళవారం మీడి యాతో మాట్లాడారు.
ప్రభుత్వ వైఫల్యా లు, తప్పులను ప్రశ్నిస్తే అధికార పార్టీ నాయకులు దాడులకు దిగడం దారుణమని మండిపడ్డారు. ఎన్నికల హామీలను అమలు చేయడంలో కాంగ్రెస్ ప్రభుత్వం దారుణంగా విఫలమైందని ఆరోపించారు. రైతుభరోసా, రుణమాఫీ, ధాన్యా నికి బోనస్.. ఏదీ సక్రమంగా ఇవ్వకుం డా సర్కారు రైతులను దారుణంగా మో సగించిందని ఆక్షేపించారు.
గ్రామసభల్లో రైతులు, ప్రజలు కాంగ్రెస్ నాయకులపై తిరగబడుతున్నారని, చాలాచోట్ల దరఖాస్తులు చెత్తబుట్టల్లో వేయడమే ఇందుకు నిదర్శమని పేర్కొన్నారు. ప్రజల్లో చైత న్యం మొదలైందని, కాంగ్రెస్ ప్రభుత్వా న్ని దేవుడు కూడా కాపాడలేడని వ్యాఖ్యానించారు. నల్లగొండలో మంత్రి కోమటి రెడ్డి రౌడీయిజం చేస్తున్నారని, పోలీసులు కాంగ్రెస్ కార్యకర్తలా వ్యవహరిం చడం సరికాదన్నారు.
కేటీఆర్ ఫొటో చూస్తేనే మంత్రి వెంకటర్‌రెడ్డికి వణుకుపుడుతోందని, అందుకే పోలీసులను అడ్డుపెట్టి రైతు మహాధర్నాను అడ్డుకున్నారని దుయ్యబట్టారు. మాజీ ఎమ్మెల్యే భూపాల్‌రెడ్డిపై కాంగ్రెస్ నాయకులు దాడి చేయడం సిగ్గుచేటన్నారు.
నల్లగొండను రూ.1,500 కోట్లతో అభివృద్ధి చేసింది బీఆర్‌ఎస్ ప్రభుత్వమేనని, దీని పై మంత్రి కోమటిరెడ్డి బహిరంగ చర్చకు సిద్ధమా? అని సవాల్ విసిరారు. గత కాంగ్రెస్ పాలకులే నల్లగొండ జిల్లాలో ఫ్లోరైడ్ రక్కసికి కారణమని దుయ్యబట్టా రు. కాంగ్రెస్ నాయకులు జాగ్రత్తగా వ్యవహరించాలని లేకుంటే మూల్యం చెల్లించ తప్పదని హెచ్చరించారు.