చలికాలంలో జుట్టు సంరక్షణ చాలా ముఖ్యం. చల్లని గాలి, తక్కువ తేమ కారణంగా జుట్టు పొడిగా, నిర్జీవంగా మారుతుంది. చలికాలంలో జుట్టు సంరక్షణ విషయంలో అజాగ్రత్తగా వ్యవహరిస్తే చుండ్రుతో పాటు జుట్టు బలహీనపడటం, జుట్టు రాలడం వంటి సమస్యలు మొదలవుతాయి.
ఈ సీజన్‌లో కురులు ఆరోగ్యంగా ఉండాలంటే కింది చిట్కాలు పాటిస్తే సరిపోతుంది.
చల్లని లేదా గోరు వెచ్చని నీటితో జుట్టును కడగాలి. వేడి నీరు జుట్టు పొడిబారేలా చేస్తుంది. అంతేకాకుండా కురులు మృదుత్వాన్ని కోల్పోయి.. నిర్జీవంగా తయారవుతాయి.
వారానికి ఒకసారి మంచి కండీషనర్ ఉపయోగించాలి. కురులకు కండీషనర్‌ను 15 నిమిషాలు ఉంచాలి. ఇలా చేస్తే జుట్టుకు తేమను అందించి.. జుట్టు మృదువుగా తయారవుతుంది.
హెయిర్ డ్రైయర్, స్ట్రెయిట్‌నర్ మొదలైన వాటి వినియోగాన్ని తగ్గించాలి. హీట్ స్టులింగ్ జుట్టుకు చాలా నష్టం కలిగిస్తుంది. జుట్టును వీలైనంత సహజంగా అరబెట్టాలి.
బయటకు వెళ్లినప్పుడు జుట్టుకు స్కార్ఫ్ లేదా టోపీతో కప్పుకోవాలి. ఇలా చేస్తే జుట్టుపై దుమ్ము, కాలుష్యం నుంచి జుట్టును కాపాడుకోవచ్చు.
అవకాడో, గుడ్డు, పెరుగు మొదలైన వాటితో చేసిన హెయిర్ మాస్క్‌లు జుట్టుకు పోషణనిస్తాయి. వీటిని వారానికి ఒకసారి ఉపయోగిస్తే మంచి ఫలితం ఉంటుంది.