23-03-2025 12:38:49 PM
టిఆర్ఎస్ రాష్ట్ర నాయకులు వనమా రాఘవేంద్రరావు
భద్రాద్రి కొత్తగూడెం,(విజయ క్రాంతి): కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నికల ముందు పాత్రికేయుల సమస్యలను, తమ ప్రభుత్వం అధికారంలోకి వస్తే పరిష్కరిస్తామని, అర్హులైన ప్రతి విలేఖరికి ఇంటి స్థలంతో పాటు రూ 5 లక్షలు మంజూరు చేస్తామని ప్రకటించిన కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత హామీని విస్మరించిందని బిఆర్ఎస్ రాష్ట్ర నాయకులు వనమా రాఘవేందర్రావు ద్వజమెత్తారు. ఇంటి స్థలాల కోసం గత మూడు రోజులుగా కొత్తగూడెం లోనే గంగా హుస్సేన్ బస్తీలో చేపట్టిన ఉద్యమానికి ఆదివారం ఆయన సంపూర్ణ మద్దతు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ విలేకరుల న్యాయమైన డిమాండ్లను తక్షణమే పరిష్కరించాలని, అర్హులైన పాత్రికేయులకు వెంటి స్థలాన్ని ఉచితంగా కేటాయించాలని ఆయన డిమాండ్ చేశారు. లేనిపక్షంలో బిఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున ఆందోళన ఉదృతం చేస్తామని హెచ్చరించారు. గతంలో కొత్తగూడెం పట్టణంలో మాజీమంత్రి వనమా సహకారంతోనే విలేకరులకు ఇంటి స్థలాలు కేటాయించిన విషయాన్ని ఆయన గుర్తు చేశారు.
ఈ యొక్క కార్యక్రమంలో మాజీ మున్సిపల్ వైస్ చైర్మన్ దామోదర్ యాదవ్, మాజీ ఎంపీపీ బాదావత్ శాంతి, మాజీ కౌన్సిలర్లు వేముల ప్రసాద్, అంబుల వేణు, రుక్మేందర్ బండారి, మండల పార్టీ అధ్యక్షులు కొట్టి వెంకటేశ్వర్లు, మాజీ ఉర్దూగర్ కమిటీ చైర్మన్ అన్వర్ పాషా, టీబీజీకేసు నాయకులు కూసాని వీరభద్రం, బిఆర్ఎస్ పార్టీ నాయకులు నవతన్, తొగర రాజశేఖర్, నాగబాబు, తెలుగు అశోక్, దూడల కిరణ్, తాండ్ర శీను, శివ, అరుణ్, కరాటే శీను, మంజుల, సురేందర్, పెయింటర్ రాజేష్, ఆవునురు చంద్రయ్య, వినోద్, సుందర్, జానీ,నిజం, అమరేందర్, బొమ్మిడి రమాకాంత్, బంగువుల శ్రీధర్, లచ్చిరాం, బొట్టు శీను మరియు బిఆర్ఎస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు, మహిళా నాయకురాలు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.