calender_icon.png 25 September, 2024 | 4:00 PM

డ్రగ్స్ పై అవగాహన కల్పించిన జూనియర్ ఎన్టీఆర్

25-09-2024 01:55:47 PM

హైదరాబాద్,(విజయక్రాంతి): డ్రగ్స్ రహిత సమాజమే లక్ష్యంగా కృషి చేస్తున్నతెలంగాణ ప్రభుత్వం ముందుకు వెళ్తోంది. డ్రగ్స్ మహమ్మారిని ఆరికట్టేందుకు, దానిపై రాష్ట్ర ప్రభుత్వం, చిరంజీవి సహా పలువురు సినీ నటులు అవగాహన కార్యక్రమాలను నిర్వహిస్తున్నారు. తాజాగా జూనియర్ ఎన్టీఆర్ కూడా తెలంగాణ ప్రభుత్వంతో చేతులు కలిపారు. డ్రగ్స్ ను నివారించడానికి యువత సహకరించాలని జూనియర్ ఎన్టీఆర్ పిలుపునిచ్చారు.

డ్రాగ్స్ కు ఆకర్శితులై ఎంతోమంది యువత తమ జీవితాలను నాశనం చేసుకుంటున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. రండి.. నాతో రండి అంటూ.. డ్రాగ్స్ రహిత సమాజమే లక్ష్యంగా కోనసాగుతున్న తెలంగాణ ప్రభుత్వం సంకల్పంలో భాగస్వామ్యులు అవ్వండి. మీకూ తెలిసి ఎవరైన డ్రాగ్స్ అమ్మటంకానీ, కోన్నటం కానీ, వినియోగించటం కానీ చేస్తున్నట్లైతే వెంటనే యాంటీ నార్కోటిక్‌ బ్యూరో ఫోన్ నంబర్ 8712671111కు ఫోన్ చేసి సమాచారం అందించాలని తన వంతు సహకరిస్తూ ఎక్స్ వేదికగా ఎన్టీఆర్ ఒక వీడియోను విడుదల చేశారు.