calender_icon.png 27 December, 2024 | 1:34 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

రోడ్డు ప్రమాదంలో జూనియర్ లైన్మెన్ మృతి

22-10-2024 10:56:49 AM

హుజురాబాద్,(విజయక్రాంతి): కరీంనగర్ జిల్లాలో దారుణం చోటు చేసుకుంది. హుజరాబాద్ మండలం తుమ్మనపల్లి  గ్రామంలో జూనియర్ లైన్మెన్ రోడ్డు ప్రమాదంలో మృతి చెందాడు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం... ఇల్లందకుంట మండలం మల్యాల గ్రామానికి చెందిన మ్యాదరి సాయి రమణ(30) ఆముదాలపల్లిలో జూనియర్ లైన్మెన్ గా విధులు నిర్వహిస్తున్నాడు. సోమవారం రాత్రి 8 గంటల తర్వాత విధులు నిర్వహించి తిరిగి స్వగ్రామమైన మల్యాలకు వెళ్తుండగా బ్రేక్ డౌన్ అయింది.

మార్గమధ్యలో తుమ్మలపల్లి గ్రామం కాకతీయ కాలువ సమీపంలో స్పీడ్ బ్రేకర్ల వద్ద ద్విచక్ర వాహనం అదుపుతప్పి కింద పడడంతో సాయి రమణ అక్కడికక్కడే మృతి చెందాడు. స్థానికుల సమాచారంతో ఘటన స్థలికి చేరుకొని పోలీసులు మృతదేహాన్ని స్వాధీనం చేసుకుని, పోస్టుమార్టం నిమిత్తం హుజురాబాద్ ఏరియా హాస్పిటల్ మార్చురీకి  తరలించారు. ఈ మేరకు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు.