హైదరాబాద్, జూలై 8 (విజయక్రాంతి): జూనియర్ లెక్చరర్ పోస్టుల కు సంబంధించిన పరీక్షా ఫలితాలను టీజీపీఎస్సీ విడుదల చేసింది. ఈ మేరకు జనరల్ ర్యాంకింగ్ జాబితాలను సోమవారం వెల్లడించింది. సబ్జె క్టుల వారీగా జనరల్ ర్యాంకింగ్‌ను విడుదల చేసింది. 1:2 నిష్పత్తిలో షార్ట్ లిస్టు జాబితాను త్వరలోనే విడుదల చేస్తామని స్పష్టం చేసింది. పీడబ్ల్యూడీ అభ్యర్థులకు మాత్రం 1:5 నిష్పత్తిలో షార్ట్ లిస్టు చేసి ధ్రువపత్రాల పరిశీలనకు పిలుస్తామని తెలిపింది. ఇంటర్ విద్యాశాఖలోని ఖాళీలకు గతేడాది సెప్టెంబర్, అక్టోబర్ నెలల్లో జేఎల్ పరీక్షను నిర్వహించారు. ల్యాబ్ టెక్నీషియన్ గ్రేడ్-2 పోస్టులకు ఎంపికైనవారి జాబితాను సైతం టీజీపీఎస్సీ విడుదల చేసింది.