calender_icon.png 26 October, 2024 | 6:03 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

జూనియర్ లెక్చరర్ పరీక్ష ఫలితాలు విడుదల

08-07-2024 07:20:18 PM

హైదరాబాద్ : తెలంగాణ జూనియర్ లెక్చరర్ పరీక్ష ఫలితాలు విడుదలయ్యాయి. తెలంగాణ రాష్ట్ర పబ్లిక్ సర్వీస్ కమిషన్ జూనియర్ లెక్చరర్ సబ్జెక్టుల వారీగా జనరల్ ర్యాంకింగ్ లిస్టు విడుదల చేసింది. ఈ ఫలితాలను 1:2 నిష్పత్తిలో షార్ట్ లిస్టు జాబితాను త్వరలోనే వెల్లడిస్తామని అధికారులు తెలిపారు.

పీడబ్ల్యూడీ అభ్యర్థులకు 1:5 నిష్పత్తిలో షార్ట్ లిస్టు చేస్తామని, టీజీపీఎస్సీ జూనియర్ లెక్చరర్ ఎంపిక పరీక్షలను గతేడాది 12 సెప్టెంబర్ 2023 నుంచి 03 అక్టోబర్ 2023 వరకు నిర్వహించింది. టీజీపీఎస్సీ జూనియర్ లెక్చరర్ పరీక్ష ఫలితాలను తన  అధికారిక వెబ్ సైట్ https://www.tspsc.gov.in లో విడుదల చేసింది.