లుసానే: వచ్చే ఏడాది జరగనున్న జూనియర్ హాకీ ప్రపంచకప్‌నకు భారత్ ఆతిథ్యమివ్వనుంది. ఈ మేరకు అంతర్జాతీయ హాకీ సమాఖ్య మంగళవారం ఒక ప్రకటన విడుదల చేసింది. దీంతో తొమ్మిదేండ్ల తర్వాత మన దేశంలో జూనియర్ వరల్డ్‌కప్ జరగనుంది. వచ్చే ఏడాది డిసెంబర్‌లో నిర్వహించనున్న ఈ టోర్నీలో 24 జట్లు పాల్గొననున్నాయి. నిరుడు ఈ టోర్నీకి కౌలాలాంపూర్ ఆతిథ్యమివ్వగా.. ఈసారి భారత్‌కు అవకాశం దక్కింది. హాకీ ఇండియా అధ్యక్షుడు దిలిప్ టిర్కీ మాట్లాడుతూ.. ఈ టోర్నీ వల్ల భారత్‌లో హాకీకి మరింత ప్రాచుర్యం లభిస్తుందని ఆశాభావం వ్యక్తం చేశాడు. టోక్యో ఒలింపిక్స్‌లో భారత సీనియర్ జట్టు పతకం నెగ్గిన తర్వాత.. యువకులు హాకీని కెరీర్‌గా ఎంచుకునేం దుకు ఆసక్తి చూపుతున్నారని అన్నారు.