calender_icon.png 16 March, 2025 | 8:38 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

కొమురవెల్లిలో జూనియర్ కళాశాల ఏర్పాటు చేయాలి

15-03-2025 11:16:02 PM

చేర్యాల,(విజయక్రాంతి): కొమురవెల్లి మండల కేంద్రంలో ప్రభుత్వ జూనియర్ కళాశాల ఏర్పాటు చేయాలని ఎస్ఎఫ్ఐ డివిజన్ కార్యదర్శి తాడూరి భరత్ కుమార్ అన్నారు. ఎస్ఎఫ్ఐ ఆధ్వర్యంలో స్థానిక ప్రభుత్వ పాఠశాల విద్యార్థులు ర్యాలీగా వెళ్లి స్థానిక ఎంఈఓ కార్యాలయం ముందు ధర్నా నిర్వహించారు. సందర్భంగా ఆయన మాట్లాడుతూ మండలం 8 ఏర్పాటై సంవత్సరాలు కావస్తున్న, ఇంతవరకు జూనియర్ కళాశాల ఏర్పాటు చేయకపోవడం శోచనీయమన్నారు. ప్రతి మండలానికి ఒక జూనియర్ కళాశాల ఉండాలన్న ప్రభుత్వ నిబంధన ఉన్నప్పటికీ, ఇప్పటికీ ఏర్పాటు చేయలేదన్నారు.

ప్రభుత్వం విద్య పట్ల నిర్లక్ష్య వైఖరి అవలంబిస్తుందన్నారు. అదేవిధంగా మండలంలో ఎస్సీ, బీసీ హాస్టల్ లను ఏర్పాటు చేయాలని ఆయన డిమాండ్ చేశారు. మండల కేంద్రంలో ప్రభుత్వ విద్యాసంస్థలు లేకపోవడం వల్ల విద్యార్థులు విద్యకు దూరమవుతున్నారన్నారు. విద్యాసంస్థల ఏర్పాటుకు కావలసిన అన్ని సౌకర్యాలు ఉన్నాయన్నారు వెంటనే మండల కేంద్రంలో జూనియర్ కళాశాలను, ఎస్సీ, బీసీ హాస్టలను ఏర్పాటు చేయాలని, లేనిపక్షంలో మండలంలోని విద్యార్థులను కూడగట్టుకొని పెద్ద ఎత్తున ఆందోళన చేపడతామన్నారు. కార్యక్రమంలో ఎస్ఎఫ్ఐ నాయకులు తాడూరి ప్రకాష్, సమీర్, రాజు తదితరులు పాల్గొన్నారు.