calender_icon.png 15 November, 2024 | 6:34 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

జూనియర్ అసిస్టెంట్ సస్పెండ్

12-11-2024 01:05:47 AM

సూర్యాపేట, నవంబర్ 11 (విజయక్రాంతి): సూర్యాపేట జిల్లా ల్యాం డ్ సర్వే కార్యాలయంలో జూనియర్ అసిస్టెంట్‌గా పనిచేస్తున్న వై.వెంకట్‌రెడ్డి ని సస్పెండ్ చేస్తూ కలెక్టర్ తేజస్ నందలాల్ పవార్ సోమవారం ఉత్తర్వులు జారీ చేశారు. భూమి సర్వే కోసం రూ.10వేలు లంచం తీసుకున్నారని కోదాడ నియోజకవర్గం శ్రీరంగాపురానికి చెందిన రైతు దొంగరి వెంకటేశ్వర్లు ఫిర్యాదు మేరకు విచారణ జరిపి సస్పెండ్ చేసినట్లు ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. అధికారులు, సిబ్బంది అవినీతికి పాల్పడితే చర్యలు తప్పవని ఈ సందర్భంగా కలెక్టర్ హెచ్చరించారు.