calender_icon.png 19 January, 2025 | 11:57 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

జూలై 22 హాటెస్ట్ డే

25-07-2024 01:35:31 AM

న్యూఢిల్లీ, జూలై 24: భూమి మీద అత్యంత వేడి దినంగా జూలై 21 రికార్డు నెలకొల్పిన 24 గంటల్లోనే జూలై 22వ తేదీ ఆ రికార్డును బద్దలు కొట్టింది. దీంతో 84 సంవత్సరాల రికార్డు కనుమరుగయింది. జూలై 21రోజు సాధారణం కంటే 17.09 డిగ్రీల సెల్సియస్ ఉష్ణోగ్రత ఎక్కువ నమోదు కాగా.. జూలై 22 నాడు సాధారణం కంటే 17.15 డిగ్రీల సెల్సియస్ ఉష్ణోగ్రతలు నమోదైనట్లు యూరోపియన్ క్లుమైట్ చేంజ్ సర్వీస్ తెలిపింది. 1940 తర్వాత జూలై 22 భూగ్రహం అత్యధిక వేడిగా ఉన్న దినం అని సంస్థ తెలిపింది. గడిచిన 1,25,000 సంవత్సరాలతో పోల్చుకుంటే భూగ్రహ ఉష్ణోగ్రతలు ఇప్పుడే అధికంగా ఉన్నాయని సీ3ఎస్ అభిప్రాయపడింది. ఇలా వాతావరణంలో మార్పులు సంభవించేందుకు బొగ్గు ని మండించడం, అడవుల నరికివేత తదితర కారణాలు ఉన్నాయంది.